AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండుగపూట.. బావపై దాడి చేసి మర్మాంగాలను కొరికేసిన మహిళ.. విషయం తెలిసి అంతా షాక్!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో కుటుంబ కలహం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మేనల్లుడు ఇంట్లో భోజనం చేయడంపై తలెత్తిన వివాదం చివరకు దాడి వరకు వెళ్లింది. ఈ క్రమంలో తన బావపై మహిళ దాడి చేయడమే కాకుండా, అతడి జననాంగాలపై కొరికింది. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

పండుగపూట.. బావపై దాడి చేసి మర్మాంగాలను కొరికేసిన మహిళ.. విషయం తెలిసి అంతా షాక్!
Shocking Family Dispute
Balaraju Goud
|

Updated on: Oct 25, 2026 | 7:42 PM

Share

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో కుటుంబ కలహం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మేనల్లుడు ఇంట్లో భోజనం చేయడంపై తలెత్తిన వివాదం చివరకు దాడి వరకు వెళ్లింది. ఈ క్రమంలో తన బావపై మహిళ దాడి చేయడమే కాకుండా, అతడి జననాంగాలపై కొరికింది. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాలుడు భోజనం చేయడంపై మొదలైన వివాదం

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా సజేతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఘురౌపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం (అక్టోబర్ 23) సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో రజనీష్‌ ఇంట్లో అతడి సోదరుడు పుష్పరాజ్‌ కుమారుడు రేహంష్‌ భోజనం చేస్తున్నాడు. ఈ విషయం బాలుడి తల్లి గాయత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆమె బాలుడిని తీవ్రంగా కొట్టడం ప్రారంభించింది. దీనిపై రజనీష్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే వివాదం ముదిరి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.

బావపై దాడి చేసిన యువతి..!

గొడవ సమయంలో గాయత్రి తనపై దాడి చేసిందని రజనీష్‌ ఆరోపించాడు. ఈ క్రమంలో తన కింది దుస్తులు జారిపోగా, ఆమె తన జననాంగాలపై కొరికిందని తెలిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా, పరిస్థితి మెరుగుపడిన అనంతరం శనివారం డిశ్చార్జ్‌ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంతేకాకుండా, వాగ్వాదం సమయంలో గాయత్రి కత్తితో తన భర్తపై దాడి చేయడానికి ప్రయత్నించిందని రజనీష్‌ భార్య సుమన్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు.

గతంలోనూ కుటుంబ కలహాలు?

ఈ కుటుంబంలో గతంలోనూ విభేదాలు ఉన్నట్లు కుటుంబ పెద్ద రామ్‌ స్వరూప్‌ పేర్కొన్నారు. మనవడు కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చినప్పుడు అతడిని కొట్టడం, ఇతరులతో కలవకుండా అడ్డుకోవడం జరిగేవని ఆయన ఆరోపించాడు. మహానవమి సందర్భంగా కూడా ఇలాంటి వివాదం తలెత్తగా కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దిచెప్పినట్లు పేర్కొన్నారు.

కేసు నమోదు.. నిందితురాలి కోసం గాలింపు

బాధితుడి భార్య ఫిర్యాదు ఆధారంగా సజేతి పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహానికి దారితీసిన పరిస్థితులు, దాడికి సంబంధించిన ఆరోపణలపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాకే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us