Anirudha Srikkanth: సినీ నటిని పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్.. ఎవరో తెలుసా..?
Anirudha Srikkanth Weds Samyuktha Shanmuganathan: గత ఆగస్టులోనే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు వీరి ప్రేమ పెళ్లి బంధంగా మారడంతో అభిమానులు, పలువురు సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Anirudha Srikkanth Weds Samyuktha Shanmuganathan: భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు, క్రికెటర్ అనిరుద్ధ శ్రీకాంత్ ఓ ఇంటివాడయ్యాడు. తమిళ బిగ్‌బాస్ ఫేమ్, నటి సంయుక్త షణ్ముగనాథన్‌తో గురువారం (నవంబర్ 27) ఆయన వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది.
వివాహం అనంతరం ఈ నూతన జంట తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెళ్లి ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ టీవీ ప్రజెంటర్, సంయుక్త స్నేహితురాలు భావన బాలకృష్ణన్ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. “స్నేహితులుగా ఒకరికొకరు తోడుగా నిలిచిన జంట మీరు. మీ ఇద్దరికీ అందమైన జీవితం లభించాలని కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు.
కాగా, సంయుక్త తమిళ బిగ్‌బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె ‘మద్రాస్ మాఫియా కంపెనీ’ అనే తమిళ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించి, ఆకట్టుకుంది. సంయుక్త షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, నిర్మాత కార్తీక్ శంకర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే, అభిప్రాయ భేదాల కారణంగా, ఇద్దరూ విడిపోయారు. దీంతో ఈమె రెండోసారి వివాహం చేసుకుంది.
ఇక అనిరుద్ధ శ్రీకాంత్ క్రికెటర్‌గానే కాకుండా స్పోర్ట్స్ కామెంటేటర్‌గానూ రాణిస్తున్నారు. అనిరుద్ధ 2012లో ఆర్తి వెంకటేష్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే, అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలోనే సంయుక్త అనిరుద్ధను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు విస్తృతంగా పుకార్లు వచ్చాయి.
గత ఆగస్టులోనే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు వీరి ప్రేమ పెళ్లి బంధంగా మారడంతో అభిమానులు, పలువురు సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
