Fifa World Cup: టీమిండియాలో ఫిఫా ఫీవర్.. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రెడీ చేసుకుంటోన్న క్రికెటర్లు
ఆదివారం అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ మధ్య జరగనున్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇందుకోసం తగిన ప్రణాళికలు కూడా ఏర్పాటుచేసుకుంటున్నారు భారత ఆటగాళ్లు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించి 2 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత జట్టు 5వ, చివరి రోజు ఆరంభంలో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత, ఆదివారం అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ మధ్య జరగనున్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇందుకోసం తగిన ప్రణాళికలు కూడా ఏర్పాటుచేసుకుంటున్నారు భారత ఆటగాళ్లు. ఈ మేరకు ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ విషయంలో టీమ్ ఇండియా ప్లానింగ్ ఏంటో బంగ్లాదేశ్ పై విజయం సాధించిన అనంతరం మీడియా సమావేశంలో కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఈ సందర్భంగా ఫిఫా ప్రపంచకప్ మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారని రాహుల్‌ని అడగ్గా.. ‘జట్టులోని చాలా మంది ఆటగాళ్లు సపోర్ట్ చేస్తున్న జట్టు ఇప్పటికే ఇంటి బాటపట్టాయి. భారత ఆటగాళ్లలో ఎక్కువ మంది బ్రెజిల్, ఇంగ్లండ్‌లకు అభిమానులే. ఇప్పుడు మనం ఫైనల్‌ని ఆస్వాదిస్తాం. ఇక ఫైనల్‌లో అర్జెంటీనాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, ఫ్రాన్స్‌కు ఎవరు మద్దతిస్తున్నారో నాకు తెలియదు. అయితే టీమ్ మొత్తం ఈ రాత్రి చక్కగా డిన్నర్ చేసి ఫైనల్ మ్యాచ్‌ని చూస్తాం. ఈ 5 రోజులు చాలా అలసిపోయాం. ఇప్పుడు ఫైనల్ చూసి అందరమూ విశ్రాంతి తీసుకుంటాం’ అని చెప్పుకొచ్చాడు.
ఇక బంగ్లాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌ను 150 పరుగులకే కట్టడి చేసి భారీ ఆధిక్యం సాధించారు. అయితే ఆతిథ్య జట్టుకు ఫాలో ఆన్ ఇవ్వకుండా మళ్లీ టీమిండియానే బ్యాటింగ్ చేసింది. 2 వికెట్లకు 258 పరుగులు చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 513 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అయితే బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో గట్టిగా పోరాడింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ సెంచరీ సాధించాడు. అతని తర్వాత, షకీబ్ అల్ హసన్ 84 పరుగులు చేశాడు, కానీ భారత బౌలర్లు చివరి రోజు బంగ్లాదేశ్ బ్యాటింగ్ ను చెల్లాచెదురు చేశారు. మొత్తం జట్టును 324 పరుగులకు కట్టడి చేశారు. 22 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కుల్దీప్ యాదవ్ 40 పరుగులతో పాటు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 8 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు.
What stood out for #TeamIndia in their win over Bangladesh in the first Test ? #BANvIND
?️ ?️ Here’s what captain @klrahul said ? pic.twitter.com/loCwIWzG7K
— BCCI (@BCCI) December 18, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..