WTC 2023 Final: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియాకు ప్రమోషన్.. ఫైనల్ బెర్తు కోసం ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
తాజా భారీ విజయంతో కలిపి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మొత్తం పాయింట్ల సంఖ్య 12కు చేరింది. దీంతో పాటు ఒక స్థానం పైకి ఎగబాకి ఫైనల్ రేసులో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 188 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. దీంతో పాటు ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ ఆడేందుకు మరో అడుగు ముందుకేసింది. తాజా భారీ విజయంతో కలిపి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మొత్తం పాయింట్ల సంఖ్య 12కు చేరింది. దీంతో పాటు ఒక స్థానం పైకి ఎగబాకి ఫైనల్ రేసులో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు టీమిండియా కంటే ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మాత్రమే ఉన్నాయి.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 55.33 శాతం పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. శ్రీలంకలో 53.33 శాతం పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 75 శాతం పాయింట్లతో ఆస్ట్రేలియా నంబర్‌వన్‌గా ఉంది. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది.
22 నుంచి రెండో టెస్టు..
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి పాకిస్థాన్ జట్టు ఇప్పటికే నిష్క్రమించింది. అదే సమయంలో, ఇంగ్లండ్‌కు ఫైనల్‌కు చేరుకోవడం అంత సులభమేమీ కాదు. ప్రస్తుతం ఇంగ్లిష్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్థాన్ ఆరో స్థానంలో ఉంది. భారత్ ఇప్పుడు డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ టెస్టులోనూ భారత్ భారీ విజయం సాధించాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టెస్టు సిరీస్ కూడా టీమిండియాకు చాలా కీలకం.
.@akshar2026 scalped FOUR wickets in the final innings of the match & was #TeamIndia‘s top performer ??
A summary of his bowling display ? pic.twitter.com/NDmZuPYJS2
— BCCI (@BCCI) December 18, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..