Rahul Dravid: ”నా జట్టంటే 11 కాదు 15 మంది.. ప్రతీ ఆటగాడికి అవకాశం ఇస్తాను”
టీమిండియా దిగ్గజ క్రికెటర్, ది వాల్ రాహుల్ డ్రావిడ్ ప్రధాన కోచ్‌గా భారత-బీ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా
టీమిండియా దిగ్గజ క్రికెటర్, ది వాల్ రాహుల్ డ్రావిడ్ ప్రధాన కోచ్‌గా భారత-బీ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డ్రావిడ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. సిరీస్‌కు ఎంపికై.. ఒక్క మ్యాచ్ కూడా అడనివ్వకపోతే.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని.. అందుకే తన జట్టంటే 11 కాదు 15 మంది ఉంటారని డ్రావిడ్ అన్నాడు. అండర్ 19, భారత్-ఏ జట్లతో ఇదే పద్దతిని అనుసరించానని శ్రీలంక పర్యటనలోనూ ఈ సిద్దాంతాన్నే అమలు చేస్తానని పేర్కొన్నాడు.
టూర్‌కు వచ్చే ప్రతీ ఆటగాడికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. కాగా, శ్రీలంక పర్యటనలో శిఖర్ ధావన్ నేతృత్వంలో యువ భారత జట్టు.. మూడు టీ20లు(జూలై 21, 23, 25), మూడు వన్డేలు(జూలై 13, 16, 18)ఆడనుంది. జరు జట్ల మధ్య తొలి వన్డే జూలై 13న జరగనుండగా.. టూర్‌లో ఆఖరి మ్యాచ్ జూలై 25న జరుగుతుంది.
టీమిండియా జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా.
Also Read:
ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!
అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!
ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..