అందంలో హీరోయిన్లకు పోటీనిస్తున్న టీమిండియా క్రికెటర్ల భార్యలు.. వారి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని పెద్దలు అంటుంటారు. మన టీమిండియా క్రికెటర్లను చూస్తుంటే.. అది నిజమని అనిపిస్తుంది....
ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని పెద్దలు అంటుంటారు. మన టీమిండియా క్రికెటర్లను చూస్తుంటే.. అది నిజమని అనిపిస్తుంది. ఎం.ఎస్.ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పుజారా, రవీంద్ర జడేజా.. ఇలా ప్రతీ క్రికెటర్ గురించి ప్రపంచం మొత్తం తెలుసు. కానీ వారి భార్యలు మాత్రం మీడియా ముందుకు రావడం చాలా తక్కువ. అందంతో పాటు తెలివితేటలు కలిగిన వీరు బాలీవుడ్ హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోరు. పదండి మరీ ఆ మహిళల గురించి పాలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
1. రవీంద్ర జడేజా- రివాబా జడేజా:
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య పేరు రివాబా జడేజా. ఎంత క్రికెటర్ భార్య అయినా.. ఈమె తన వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు దూరంగా ఉంచుకోవాడాన్ని ఇష్టపడుతుంది. జడేజా, రివాబాకు 2016లో వివాహం జరిగింది. రాజ్‌కోట్‌లోని అత్మియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి రివాబా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు.
2.అజింక్య రహానే – రాధిక డోపావ్కర్
అజింక్య రహానే, రాధిక డోపావ్కర్ చిన్ననాటి నుంచే స్నేహితులు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాధిక.. రహనే కెరీర్ ఎత్తుపల్లాల్లో అతడికి తోడుగా ఉంటూ ముందుకు నడిపించింది.
3.ఇషాంత్ శర్మ – ప్రతిమా సింగ్
ఇషాంత్ శర్మ భార్య ప్రతిమా భారత జాతీయ బాస్కెట్‌బాల్ జట్టులో సభ్యురాలు. ఆమె నోయిడాలోని జెనెసిస్ గ్లోబల్ స్కూల్‌లో చీఫ్ స్పోర్ట్స్ అడ్వైజర్‌గా కూడా పనిచేస్తుంది. ప్రతిమా, ఇషాంత్ 2016లో వివాహం చేసుకున్నారు.
4.ఇర్ఫాన్ పఠాన్ – సఫా బేగ్
భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఫిబ్రవరి 4, 2016న సఫా బేగ్‌ను వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందు సఫా సౌదీ అరేబియాలో పేరున్న మోడల్. పలు ప్రముఖ బ్రాండింగ్ యాడ్స్‌లో కూడా నటించింది. ప్రస్తుతం ఓ పీఆర్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పని చేస్తోంది.
5.ఉమేష్ యాదవ్ – తాన్య వాధ్వా
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ భార్య తాన్య వాధ్వా వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. మూడేళ్లుగా ఒకరితో ఒకరు డేటింగ్ చేసుకుని ఉమేష్, తాన్య 2013 మే 29న వివాహం చేసుకున్నారు.
Also Read:
ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!
అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!
ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..