Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs IND: ఒంటి చేత్తో సిక్స్ కొట్టి సెంచరీ.. పంత్ సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో ఇదిగో

టీం ఇండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషబ్ పంత్ శనివారం (జూన్ 21) ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో భారీ సెంచరీ సాధించాడు. ఇక ఒంటి చేత్తో సిక్స్ కొట్టి మూడంకెల స్కోరుకు చేరుకున్న పంత్ తన దైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు.

ENG vs IND: ఒంటి చేత్తో సిక్స్ కొట్టి సెంచరీ.. పంత్ సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో ఇదిగో
Rishabh Pant
Basha Shek
|

Updated on: Jun 21, 2025 | 6:50 PM

Share

ఇంగ్లండ్ తో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా 471 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. మొదట యశస్వి జైస్వాల్, ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఇక శనివారం వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ పంత్ సెంచరీలతో మెరిశారు. శనివారం ఇంగ్లిష్ బౌలర్లను చితక బాదిన రిషబ్ తన టెస్ట్ కెరీర్‌లో ఏడవ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై అతనికిది మూడో సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. 99 పరుగుల ద్ద ఒంటి చేత్తో అద్భుతమైన సిక్స్ కొట్టి తన సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఇక ఎప్పటిలాగే శ‌త‌కం పూర్తి కాగానే బ్యాట్‌ను, హెల్మెట్‌ను ప‌క్క‌న ప‌డేసి.. గాలిలో ప‌ల్టీ కొడుతూ వెరైటీ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడీ టీమిండియా బ్యాటర్. జిమ్నాస్ట్ త‌ర‌హాలో గాలిలో పల్టీలు కొడుతూ ఎగిరి సంబరాన్ని షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాగా ఐపీఎల్ చివరి మ్యాచ్‌లోనూ రిషబ్ పంత్ ఇలాగే సంబరాలు చేసుకున్నాడు. ఆర్‌సిబితో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో, రిషబ్ పంత్ 61 బంతుల్లో అజేయంగా 118 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత, అతను గాలిలోకి పల్టీలు కొడుతూ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

పంత్ సెంచరీ సెలబ్రేషన్స్.. వీడియో..

ఇక భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంత్ జోరు చూసి స్కోరు 500 దాటుతుందేమో అనిపించింది. కానీ అతను ఔటయ్యాక టీమిండియా కుప్పకూలింది. బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. కరుణ్ నాయర్, శార్దూల్ ఠాకూర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, జోష్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.

ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇలా.

టీమ్ ఇండియా:

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, పర్షిద్ కృష్ణ.

ఇంగ్లాండ్:

జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టోంగ్, షోయబ్ బషీర్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి