Tollywood: రెండు సార్లు అబార్షన్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ యాంకర్
పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమే. అలాగే కొన్ని టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించిందీ అందాల తార. ఇప్పుడీ బుల్లితెర బ్యూటీ రెండో సారి అమ్మగా ప్రమోషన్ పొందింది.

టాలీవుడ్ యాంకర్, బుల్లితెర నటి సమీరా షెరిఫ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆడపిల్ల సీరియల్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిందీ అందాల తార. ఆ తర్వాత అభిషేకం, భార్యామణి, ముద్దుబిడ్డ, మూడు ముళ్ల బంధం తదితర సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించింది. అలాగే అదిరింటి షోకు కొన్ని రోజుల పాటు యాంకర్ గానూ వ్యవహరించింది. సీరియల్స్, టీవీ షోల సంగతి పక్కన పెడితే.. సమీరా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు, పండంటి మగ బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టిందీ అందాల తార. ‘బుడ్డోడు మా జీవితాల్లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా జీవితాల్లో కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నాం’ అని తన పోస్టులో రాసుకొచ్చింది సమీరా. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు సమీరా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నాలుగు సార్లు గర్భం దాలిస్తే..
కాగా సమీరా షెరీఫ్ 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తితో కలిసి పెళ్లి పీటలెక్కింది. ఆ మరుసటి ఏడాదే ఆమె మొదటి సారి గర్భం దాల్చింది. అయితే అప్పుడు సమీరా తమిళంలో ఓ రియాలిటీ షో చేస్తోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆస్పత్రికి వెళదామనుకుంది. అయితే అంతలోనే తీవ్ర రక్తస్రావమైం కావడంతో కడుపులో బిడ్డను పోగొట్టుకుంది. ఈ చేదు అనుభవం తర్వాత 2021లో మరోసారి గర్భం దాల్చింది సమీరా. అప్పుడు ఆమెకు అర్హాన్ జన్మించాడు.
సమీరా దంపతుల పోస్ట్..
View this post on Instagram
ఇక 2023లో మరోసారి ప్రెగ్నెంట్ కావడంతో సమీరా ఎంతో సంబరపడింది. మరో బిడ్డ తన జీవితంలోకి వస్తున్నాడని అందరితో చెప్పుకుని మురిసిపోయింది. కానీ.. కానీ బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో గర్భం నుంచి శిశువును తీసేశారు. దీంతో సమీరా బాగా తల్లడిల్లిపోయింది. ఇక 2024 చివర్లో మరోసారి ప్రెగ్నెంట్ అని తేలగా.. ఇప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సమీరా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.








