Sekhar Kammula: కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు బుగ్గిపాలు.. ఆ కుటుంబానికి శేఖర్ కమ్ముల లక్షల ఆర్థిక సాయం
లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు కుబేర సినిమాతో మన ముందుకు వస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

టాలీవుడ్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ములది ప్రత్యేక స్థానం. లీడర్, హ్యాపీడేస్, గోదావరి, ఆనంద్, ఫిదా, లవ్ స్టోరీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించారాయన. అందుకే ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు కుబేర సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ధనుష్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (జూన్ 20)న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు శేఖర్ కమ్ముల. ఈ క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగేళ్ల క్రితం ఒక రైతు కుటుంబానికి శేఖర్ కమ్ముల చేసిన సాయం గురించి యాంకర్ ప్రశ్నించగా డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
‘కూతురు పెళ్లి చేద్దామని ఓ రైతు దాచుకున్న డబ్బు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడని వార్త తెలిసింది. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కూతురి పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బు అలా బుగ్గి కావడంతో నేను బాగా ఎమోషనల్ అయ్యాను. బాగా డబ్బున్నోడి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతేనే ఎంతో బాధేస్తుంది.అలాంటిది పేదోడి డబ్బు, అది కూడా ఎంతో కష్టపడి సంపాధించింటాడు. అది కూడా కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు బూడిద పాలు కావడంతో ఆ రైతు బాధేంటో నాకు అర్థం అయింది. అందుకే రూ. 2లక్షల ఆర్థిక సాయం చేశాను.’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
చిరంజీవితో శేఖర్ కమ్ముల..
View this post on Instagram
శేఖర్ కమ్ముల ఇన్ని మంచి పనులు చేశారా?
2021 సమయంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మొత్తం మంటల్లో బుగ్గిపాలైంది. ఈ వార్త తెలుసుకున్న శేఖర్ కమ్ముల.. ఆ రైతు కుటుంబానికి రూ. 2లక్షలు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు పంపించారు. అంతే కాదు రైతు కుటుంబంతో మాట్లాడి అవసరమైతే మరింత సాయం చేస్తానని.. ముందు కూతురు పెళ్లి మంచిగా జరిపించాలని డైరెక్టర్ భరోసా ఇచ్చారు. కాగా కొవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు శేఖర్ కమ్ముల. తన ప్రొడక్షన్ హౌస్ అమిగోస్ నుంచి పలు సేవలు అందించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి ప్రతిరోజు ఆయన భోజనం అందించారు. అయితే ఈ మంచి పనులన్నీ ఆయన ఎక్కడా కూడా చెప్పుకున్న దాఖలాలు లేవు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








