AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గ్లామర్ ప్రపంచానికి దూరంగా.. రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ బ్యూటీ ఉన్నట్లుండి బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మూగ జీవాలతో కాలం గడుపుతోంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Tollywood: గ్లామర్ ప్రపంచానికి దూరంగా.. రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 19, 2025 | 7:57 PM

Share

సాధారణంగా షూటింగులు లేనప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు విదేశాలకు చెక్కేస్తుంటారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వెకేషన్లకు పరుగులు తీస్తుంటారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ మాత్రం సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. సినిమా షూటింగుల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కాలం గడుపుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ ఆశ్రమానికి చేరుకున్న ఈ అందాల తార అక్కడ ఉండే గోశాలలో ఉండే వివిధ మూగ జీవాలతో కలిసి ఆటలాడుతోంది. వాటిని ముద్దు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో సైతం షేర్ చేసి.. ‘ఇక్కడ నా హృదయం ప్రేమతో నిండిపోయింది. గురుదేవ్.. నాకు మార్గం చూపించినందుకు ధన్యవాదాలు. నేను మీకు కృతజ్ఞురాలిని’ అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఈ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లో గ్లామర్ ఒలికించే ఈ సొగసరి బయట ఇంత సింపుల్ గా ఉంటుందా? అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

‘హౌస్‌ఫుల్ 5’ చిత్రం విజయం తర్వాత బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెంగళూరుకు వచ్చింది. అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవి శంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో ఉంటూ సేద తీరుతోంది. ఈ సందర్భంగా  గురూజీ రవిశంకర్ దీవెనలు అందుకుంది. అనంతరం అక్కడి గోశాలలో ఉండే లేగ దూడలతో ఆడుకుంటూ, వాటిని ముద్దు చేస్తూ కనిపించింది. అలాగే గుర్రపు స్వారీ కూడా ఆనందించింది. సినిమాల్లో గ్లామర్ ఒలికించే జాక్వెలిన్ ఇక్కడ ఎంతో సింపుల్ గా మూగ జీవాలతో కలిసి పోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

పండిట్ రవిశంకర్ ఆశ్రమంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్..

కాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సాహోలో ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పలు దక్షిణాది సినిమాల్లోనూ మెరిసిందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..