AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ .. దేశంలోనే టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్

ఈ ఏడాది మేలో థియేటర్లలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఓ సైకో కిల్లర్ కథాంశతో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చింది. ఇక ఇటీవలే ఈ మూవీ ఓటీటీలోకి రాగా అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ .. దేశంలోనే టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 21, 2025 | 12:52 PM

Share

ఈ మధ్యన సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమాలు దుమ్మురేపుతుంటాయి. అలా ఇప్పుడు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు కూడా ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సుమారు 2 గంటల 16 నిమిషాలు రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.5/10 రేటింగ్ ఉండడం గమనార్హం. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే ఓటీటీలోకి రాగా ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా జనాలకు బాగా నచ్చేసింది. 2025 జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో ఈసినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశంలోనే నెంబర్ వన్ మూవీగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విశాఖపట్నంలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యలన్నీ ఒకే రకమైన ప్యాటర్న్ లో జరుగుతుండడంతో ఇవి సీరియల్ కిల్లింగ్స్ అని దర్యాప్తులో తేలుతుంది. ఒక సిన్సియర్ అండ్ స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ చేతికి ఈ సీరియల్ కిల్లింగ్ కేసును అప్పగిస్తారు. అయినా ఈ హత్యలు ఆగవు.

అయితే ఒక హత్య కేసులో విక్టిమ్ బాడీ నుండి కీలకమైన లీడ్ దొరుకుతుంది. ఆ తర్వాత చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని పోలీసాఫీసర్ తెలుసుకుంటాడు. మరి ఈ వరుస హత్యలు చేస్తున్న ఆ సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? కవలల్లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? సీరియల్‌ కిల్లర్‌కు ఈ ట్విన్స్ కు ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును పరిష్కరించారా? సైకో కిల్లర్ ను పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు లెవెన్. లోకేశ్‌ అజిల్స్‌ తెరకెక్కించిన ఈ మూవీలో నవీన్‌ చంద్ర హీరోగా నటించాడు. రియా హరి, శశాంక్‌, అభిరామి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇందులోని క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరి ఊహలకు అందదు. ఈ సినిమా చూడని వాళ్లుంటే కచ్చితంగా ఓ లుక్కేయండి.

హీరో నవీన్ చంద్ర పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..