Sekhar Kammula: డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఇంత పెద్ద కూతురుందా? ఇప్పుడేం చేస్తుందో తెలుసా? వీడియో వైరల్
సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములది 25 ఏళ్ల ప్రస్థానం. అయితే ఆయన సినిమాలు తప్పితే ఆయన ఫ్యామిలీ విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియవు. ఎందుకంటే శేఖర్ కమ్ములతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పెద్దగా బయటకు రారు. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా కనిపించరు.

లవ్ స్టోరీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇప్పుడు కుబేర సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే అక్కినేని నాగార్జున మరో లీడ్ రోల్ లో మెరిశాడు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (జూన్ 20)న కుబేర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా కుబేర సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో స్టార్స్ ఉండరు. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్లు ఉండవు. అయితే కుబేర సినిమాను మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ క్రమంలో కుబేర సినిమా చూసిన వాళ్లందరూ శేఖర్ కమ్ముల టేకింగ్ ను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూసేందుకు శేఖర్ కమ్ముల కూతురు వందన కూడా వచ్చింది. సినిమా పూర్తయ్యాక బయటకు వచ్చి తనదైన శైలిలో రివ్యూ కూడా ఇచ్చింది. ’మా టీమ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. మేం చాలా చాలా చెప్పాం. దానికి మించి ఉంది సినిమా’ అని శేఖర్ కమ్ముల కూతురు వందన చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
శేఖర్ కమ్ముల పెద్దగా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండరు. అందుకే ఆయన కుటుంబ సభ్యుల గురించిన సమాచారం చాలా మందికి తెలియదు. అలాంటిది శేఖర్ కమ్ముల కూతురు వందన ఇప్పుడిప్పుడే బయట కనిపిస్తోంది. సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ సందడి చేసింది వందన. ఇప్పుడు ఏకంగా తన తండ్రి సినిమాకు రివ్యూ ఇస్తూ వైరల్ అయిపోతోంది.
శేఖర్ కమ్ముల కూతురు వీడియో..
Sekhar Kammula’s daughter, Vandana, raves about #Kuberaa: ‘It’s beyond what we expected.’ A gripping tale of ambition and morality that’s winning hearts. #Dhanush #Nagarjuna #RashmikaMandanna pic.twitter.com/g9i0lwYyrI
— Telangana Beats (@TelanganaBeats) June 20, 2025
ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూతురు ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు నెటిజన్లు..ఈ డైరెక్టర్ కు ఇంత పెద్ద కూతురుందా అని ఆశ్చర్యపోతున్నారు. వందనను చూస్తుంటే తండ్రిలానే సినిమాల్లోకి వస్తుందేమో అనిపిస్తుందేమోనంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
కుబేర సినిమా ఈవెంట్ లో..
Sekhar kammula gari daughter Vandhana at #Kuberaa audio launch pic.twitter.com/DOKGUEMca2
— PJ (@BBTeluguViews) June 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








