Dhanush In Kuberaa : కుబేర సినిమాకు ధనుష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? నాగార్జున, రష్మిక ఎంత తీసుకున్నారంటే..
విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ హీరో ధనుష్. కేవలం హీరోయిజం ఉన్న చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళంతోపాటు హిందీ, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు కుబేర సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు.

తమిళ్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాలతో నార్త్ అడియన్స్ కు దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సార్ సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ధనుష్.. ఇప్పుడు కుబేర సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. భిన్నమైన కథాశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో ధనుష్ ఇదివరకు ఎప్పుడూ నటించని బిచ్చగాడి పాత్రలో నటించారు. జూన్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచే కుబేర సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యం శేఖర్ కమ్ముల డైరెక్షన్, ధనుష్, నాగార్జున, రష్మిక యాక్టింగ్ ఇరగదీశారంటూ రివ్యూస్ ఇస్తున్నారు జనాలు.
దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ధనుష్ తీసుకున్న పారితోషికం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. నివేదికల ప్రకారం ఈ సినిమాకు ధనుష్ రూ.30 కోట్లు పారితోషికం అందుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు ధనుష్. ఆ తర్వాత అక్కినేని నాగార్జునకు రూ.20 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా హిట్లతో ఫుల్ జోష్ మీదున్న రష్మిక కుబేర చిత్రానికిగానూ రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. నిజానికి రష్మిక హిందీ సినిమాలకు దాదాపు రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట. కానీ కుబేర సినిమాకు మాత్రం కేవలం రూ.5 కోట్లు మాత్రమే తీసుకుందని సమాచారం. అయితే ఈ వివరాలు ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
కుబేర చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్ చేశారు. ఇందులో దలీప్ తహిల్, సాయాజీ షిండే, దివ్య దేకటే, హరీష్ పెరడి ముఖ్య పాత్రలలో నటించారు.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..




