AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: వెంకటేశ్ కూతురిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే..

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటిగా మెప్పించిన ఆ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కథానాయికగా రాణించింది. భారతీయ సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అగ్ర హీరోలతో కలిసి నటించిన ఆమె.. వెంకీకి కూతురిగా, ప్రియురాలిగా నటించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Venkatesh: వెంకటేశ్ కూతురిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే..
Venkatesh
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2025 | 5:54 PM

Share

సాధారణంగా సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్లుగా మారిన తారలు చాలా మంది ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరోకు కూతురిగా నటించి.. ఆ తర్వాత అదే హీరో సరసన నటించిన హీరోయిన్స్ గురించి మీకు తెలుసా..? 1984లో అన్బుల్లా రజినీకాంత్ చిత్రంలో రజినీతో బాలనటిగా నటించింది హీరోయిన్ మీనా. ఆ తర్వాత అదే హీరోకు ముత్తు సినిమాలో ప్రియురాలిగా కనిపించింది. అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన ఓ భామ.. మీనా కంటే ముందే వెంకీకి కూతురిగా కనిపించి.. ఆ తర్వాత వెంకటేశ్ సరసన ఓ సినిమాలో ప్రియురాలిగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా. 1971లో నాగేశ్వరరావు, వాణి శ్రీ నటించిన ప్రేమనగర్ సినిమా తెలుగులో విడుదలైంది. ఈ చిత్రాన్ని తమిళంలోనూ రీమేక్ చేశారు మేకర్స్. 1972లో శివాజీ గణేషన్ నటించిన సినిమానే వసంత మాళిగై. తమిళంలో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో నాగేష్, వి.ఎస్.రాఘవన్, మేజర్ సుందరరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో వెంకటేశ్ బాలనటుడిగా కనిపించారు. ఇందులో శివాజీ గణేషన్ సోదరుడు విజయ్ పాత్రను వెంకటేశ్ పోషించారు. అయితే వసంత మాళిగై సినిమాలో శివాజీ సోదరుడు విజయ్ కూతురిగా శ్రీదేవి నటించింది. అంటే ఈ సినిమాలో యంగ్ విజయ్ పాత్రలో వెంకటేశ్ నటించారు. అంటే ఇందులో వెంకీ కూతురిగా కనిపించింది శ్రీదేవి. ఈ సినిమాతోపాటు తమిళం, తెలుగులో అనేక భాషలలో బాలనటిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత కంధన్ కరుణై సినిమాతో కథానాయికగా పరిచయమైంది.

వసంత మాళిగై సినిమాలో వెంకీ కూతురిగా నటించిన శ్రీదేవి.. ఆతర్వాత ఆయనతో కలిసి క్షణ క్షణం చిత్రంలో నటించింది. 1991లో విడుదలైన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. వెంకటేశ్, శ్రీదేవి జంటగా నటించిన ఏకైక సినిమా ఇదే. వసంత మాళిగై విడుదలైన 19 సంవత్సరాలకు వెంకటేశ్, శ్రీదేవి కలిసి క్షణక్షణం చిత్రంలో నటించారు. 1994లో చిరంజీవి నటించిన ఎస్పీ పరశురాం సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

ఇవి కూడా చదవండి
Vasantha Maligai

Vasantha Maligai

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..