AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: హీరో, విలన్ లేరు.. కానీ దిమ్మతిరిగే క్లైమాక్స్.. ఎన్నిసార్లు చూసిన అర్థం కానీ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుంది..

కథ బలంగా ఉంటే స్టార్ హీరోహీరోయిన్స్ ఉండాల్సిన అవసరంలేదు. కంటెంట్ నచ్చితే చాలు చిన్న సినిమాకు సైతం విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిన్న సినిమాలే భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అందులో ఈ మూవీ ఒకటి. ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో దుమ్మురేపుతుంది. ఇంతకీ ఏ సినిమానో తెలుసా.. ? ఇప్పుడు ఈ మూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

OTT Movie: హీరో, విలన్ లేరు.. కానీ దిమ్మతిరిగే క్లైమాక్స్.. ఎన్నిసార్లు చూసిన అర్థం కానీ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుంది..
Awe Movie
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2025 | 4:40 PM

Share

సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూడడం అంటే మీకు ఇష్టమా.. ? ఆద్యంతం మీరు ఊహించని సస్పెన్స్, ట్విస్టులతో సాగే సినిమాలు చూడాలని ఆసక్తిగా ఉంటుందా.. ? అయితే ఇప్పుడు మీరు ఈ మూవీ గురిుంచి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రం మీ మనసును పూర్తిగా కదిలిస్తుంది. దీనికి IMDB రేటింగ్ 7.6. అలాగే ఇందులో హీరో లేడు, విలన్స్ ఉండరు. కానీ ముగ్గురు హీరోయిన్స్ మాత్రమే ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది. అదే అ!. ఈ మూవీ మొత్తం కాళి అనే అమ్మాయి చుట్టూ తిరుగుుతంది. ఇందులో జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యతో బాధపడే కాళి అనే పాత్రను హీరోయిన్ కాజల్ అగర్వాల్ పోషించారు. ఈ సినిమా ఒక టైమ్ ట్రావెల్ మెషీన్ ను తయారు చేసి.. తిరిగి వెళ్లి తాను ఇంతకు ముందు ఎప్పుడూ కలవని తల్లిదండ్రులను కలవాలని కోరుకునే వ్యక్తితో ప్రారంభమవుతుంది.

ఇంక ఇందులో మీరా అనే అమ్మాయి మాదకద్రవ్యాలకు బానిస. మీరా ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తూ, తన ప్రియుడితో కలిసి ఒక ధనవంతుడైన పెట్టుబడిదారుడి నుండి డబ్బు దొంగిలించడానికి కుట్ర పన్నుతుంది. మీరా రెస్టారెంట్‌లోని చెట్టు లోపల ఒక నెక్లెస్‌ను కనుగొని దానిని తీసుకుంటుంది. మానసిక సమస్యలు.. దుర్వినియోగం.. స్వలింగ సంపర్కం అనే అంశాలను చూపిస్తుంది. తెలుగులో ఇద్దరు మహిళల ప్రేమ, బంధాన్ని చూపించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రంలో మోక్ష, రాధ, మీరా, క్రిష్, నాల్, శివ్, యోగి, పార్వతి అనే పాత్రల విభిన్నమైన, ఆశ్చర్యకరమైన కథలు కనిపిస్తాయి. కానీ క్లైమాక్స్‌లో ఇవన్నీ కేవలం చీకటి ఊహలు మాత్రమే అని తెలుస్తుంది.

చివరకు కాళి అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. 2018 లో విడుదలైన ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మించగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. నిత్యా మీనన్, రెజీనా కాసాండ్రా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఇందులో విలక్షణ నటుడు మురళీ శర్మ ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!