AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ఎంత పని చేశావయ్యా? అఫ్గాన్‌ జట్టుతోనే ఉంటూ సొంత జట్టునే ఓడించిన ఇంగ్లండ్‌ ప్లేయర్‌.. ఎవరంటే?

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును ఓడించి బట్లర్‌ సేనకు భారీ షాక్‌ ఇచ్చింది. అయితే అఫ్గాన్‌ విజయం వెనక ఒక మాజీ ఆటగాడి మాస్టర్ మైండ్ హస్తం ఉండడం గమనార్హం. అతను మరెవరో కాదు..

World Cup 2023: ఎంత పని చేశావయ్యా? అఫ్గాన్‌ జట్టుతోనే ఉంటూ సొంత జట్టునే ఓడించిన ఇంగ్లండ్‌ ప్లేయర్‌.. ఎవరంటే?
England Vs Afghanistan
Basha Shek
|

Updated on: Oct 16, 2023 | 8:04 PM

Share

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును ఓడించి బట్లర్‌ సేనకు భారీ షాక్‌ ఇచ్చింది. అయితే అఫ్గాన్‌ విజయం వెనక ఒక మాజీ ఆటగాడి మాస్టర్ మైండ్ హస్తం ఉండడం గమనార్హం. అతను మరెవరో కాదు ఇంగ్లండ్‌ రిటైర్డ్‌ బ్యాటర్‌ ఆఫ్ఘనిస్థాన్ టీమ్‌ హెడ్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు కోచ్ మాట్లాడుతూ.. ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా మా జట్టుకు ఉందన్నారు. కోచ్ మాటలను నిలబెడుతూ.. అఫ్గానిస్థాన్ జట్టు పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును ఓడించింది. వరల్డ్‌ కప్‌ పోటీల్లో భాగంగా ఇంగ్లండ్‌ను ఓడించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు అఫ్గాన్‌ జట్టు ప్రధాన కోచ్‌ జోనాథన్‌ ట్రాట్‌. కోచ్‌ నిర్ణయాలను మైదానంలో సమర్థవంతంగా అమలు చేయడంలో ఆఫ్ఘన్ ఆటగాళ్లు విజయం సాధించారు. ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు దూకుడుగా బ్యాటింగ్ చేయాలని ఆఫ్ఘన్ ఆటగాళ్లకు ట్రాట్ సూచించాడు. అందుకు తగ్గట్టుగానే రహ్మానుల్లా గుర్బాజ్ (80) అద్భుత అర్ధసెంచరీతో రాణించాడు. ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.

బలమైన ఇంగ్లండ్‌కు 285 పరుగుల సులువైన లక్ష్యమని జోనాథన్ ట్రాట్‌కు కూడా తెలుసు. అయితే ఆఫ్ఘన్ స్పిన్నర్లపై నమ్మకం ఉంచిన కోచ్.. పవర్‌ప్లేలోనే ముజీబ్ రెహమాన్ వేసిన ఓ ఓవర్ వేయాలని సూచించాడు. పేసర్ల బౌలింగ్‌లో సులువుగా పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రం రన్స్‌ రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ముజీబ్ ఉర్ రెహ్మాన్ 3 వికెట్లు తీయగా, మహ్మద్ నబీ 2 వికెట్లు తీశాడు. ఆఖరి దశలో అద్భుతంగా ఆడిన రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. దీంతో స్పిన్ అస్త్రాలతో ఇంగ్లండ్ జట్టును ఓడించాలన్న కోచ్ జోనాథన్ ట్రాట్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌పై గెలుపొందడంతో ఆఫ్ఘన్ టీమ్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. రానున్న మ్యాచ్‌ల్లోనూ ఇదే ఆటతీరును కొనసాగించి న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్లను ఓడించాలని అఫ్గాన్‌ సేన ధీమాగా ఉంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

ఇంగ్లండ్ తరఫున 68 వన్డేలు ఆడిన జోనాథన్ ట్రాట్ మొత్తం 2819 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 52 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ట్రాట్ మొత్తం 3835 పరుగులు చేశాడు. ఇందులో 2 డబుల్ సెంచరీలు, 9 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఇంగ్లండ్‌ ‘ద్రవిడ్‌’ ట్రాట్:

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..