Anushka Sharma-Sakshi: ధోనీ సతీమణి సాక్షి, కొహ్లీ భార్య క్లాస్‌మేట్స్‌తో పాటు పార్టీమేట్స్ కూడా .. ఇదిగో ఫొటోస్
ధోని సతీమణి సాక్షి, కోహ్లీ భార్య అనుష్క తరచుగా పలు క్రికెట్ టోర్నమెంట్‌లు, మ్యాచ్‌లలో కనిపించి అలరించారు. అయితే సాక్షి, అనుష్క చిన్ననాటి స్నేహితులేనట. వీరు ఒకే పాఠశాలలోనే చదివారట. ఈ క్రమంలో చిన్నతనంలో సాక్షి, అనుష్కలు కలిసున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.
టీమిండియా క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధోని కెప్టెన్సీలో విరాట్ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే కోహ్లీ కెప్టెన్సీలోనూ మిస్టర్ కూల్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధోనినే తనకు సహాయం చేశాడని కోహ్లీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టే చెప్పుకోవచ్చు వారిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో. ఇక ధోని సతీమణి సాక్షి, కోహ్లీ భార్య అనుష్క తరచుగా పలు క్రికెట్ టోర్నమెంట్‌లు, మ్యాచ్‌లలో కనిపించి అలరించారు. అయితే సాక్షి, అనుష్క చిన్ననాటి స్నేహితులేనట. వీరు ఒకే పాఠశాలలోనే చదివారట. ఈ క్రమంలో చిన్నతనంలో సాక్షి, అనుష్కలు కలిసున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ ఆర్మీ కల్నల్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు తరచుగా బదిలీలు జరిగేవి. దీంతో అనుష్క సైతం తల్లిదండ్రులతో కలిసి పలు ప్రాంతాలకు వెళ్లేదట. అలా ఒకానొక సమయంలో అనుష్క తండ్రికి అస్సాంలో పోస్టింగ్ ఇచ్చారట. అప్పుడు స్థానికంగా ఉన్న మార్గరీటాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లోనే జాయినందట అనుష్క. అప్పటికే ధోని భార్య సాక్షి కూడా అదే స్కూల్‌లోనే చదువుకుంటోందట. అలా ఇద్దరూ క్లాస్‌మేట్స్‌గా మారారాట.
కాగా స్కూల్‌డేస్‌లోనే కాదు పలు సందర్భాల్లోనూ సాక్షి, అనుష్క కలుసుకున్నారు. వీరిద్దరూ పలు పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్లలో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘సాక్షి, నేను అస్సాంలోని చాలా చిన్న పట్టణంలో నివసించాం. ఇద్దరం ఒకే స్కూల్లో చదివాం, అంతేకాదు, ఇద్దరం ఒకే తరగతి కూడా’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది అనుష్క. కాగా చదువు పూర్తయ్యాక అనుష్క సినిమా ఇండస్ట్రీలో స్థిరపడింది. విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అటు హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన సాక్షి ధోనితో కలిసి పెళ్లిపీటలెక్కింది.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..