WTC Final 2023: ఇక అందరూ వచ్చేసినట్టే.. ఇంగ్లండ్‌పై కాలుమోపిన ఆ ఐదుగురు.. ఫొటోస్‌ వైరల్‌

ఐపీఎల్ ఫైనల్ ఆడిన మరికొందరు ఆటగాళ్లు లండన్‌పై కాలుమోపారు. అజింక్యా రహానే, కేఎస్ భరత్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు లండన్ చేరుకున్న చివరి బ్యాచ్‌లో ఉన్నారు. ఈ ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడారు.

WTC Final 2023: ఇక అందరూ వచ్చేసినట్టే.. ఇంగ్లండ్‌పై కాలుమోపిన ఆ ఐదుగురు.. ఫొటోస్‌ వైరల్‌
Team India
Follow us
Basha Shek

|

Updated on: May 31, 2023 | 6:05 PM

వచ్చే వారం అంటే జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం టీమిండియా చివరి బ్యాచ్ ఇంగ్లాండ్ చేరుకుంది. ఆసీస్ తో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న టీమ్ ఇండియా.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీలో ఫైనల్ కు చేరుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు సిద్ధమయ్యేందుకు టీమిండియా ఆటగాళ్లు కొందరు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. తొలి బ్యాచ్‌లో భారత జట్టు హెడ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్, సహాయక సిబ్బంది, కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్నారు. ఆ తర్వాత రెండో బ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ సహా ఇతర ఆటగాళ్లు కూడా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ ఆడిన మరికొందరు ఆటగాళ్లు లండన్‌పై కాలుమోపారు. అజింక్యా రహానే, కేఎస్ భరత్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు లండన్ చేరుకున్న చివరి బ్యాచ్‌లో ఉన్నారు. ఈ ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడారు. ఇందులో రవీంద్ర జడేజా, అజింక్యా రహానే ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడగా, ఫైనల్లో ఓడిన గుజరాత్ టైటాన్స్ తరఫున శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, కేఎస్ భరత్ ఆడారు.

ఇప్పుడు ఆఖరి బ్యాచ్ లండన్ చేరుకోవడంతో టీమ్ ఇండియా మొత్తం లండన్‌ చేరుకున్నట్లే. హెడ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు మొత్తం జట్టుతో శిక్షణ ప్రారంభించాడు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ మరియు అక్షర్ పటేల్ తమ మొదటి శిక్షణను పూర్తి చేశారు. కోహ్లీ, రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా, అక్షర్, శార్దూల్, సిరాజ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.

ఇవి కూడా చదవండి

WTC ఫైనల్‌లో ఆడే జట్లు (అంచనా)

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, నాథన్ లియాన్, జోష్ ఇంగ్లిస్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

సబ్స్: మిచ్ మార్ష్, మాట్ రెన్షా

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, ఛెతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, అజింక్యా రహానే, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాద్కత్ .

రిజర్వ్‌: యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.

View this post on Instagram

A post shared by ICC (@icc)

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..