- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Rajasthan Royals bought England player Joe Root for Rs.1 crore but he scored just 10 runs
Rajasthan Royals: 10 పరుగులకే రూ.కోటి రూపాయలు.. అనుభవం ఉన్న అవకాశాలు రాక బెంచ్‌కే పరిమితమైన ‘టెస్ట్ స్పెషలిస్ట్’..
Rajasthan Royals: ఐపీఎల్ 2023 మినీ వేలం ద్వారా రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోటి రూపాయలు తీసుకున్నాడు. టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరున్న జో రూట్ 16వ సీజన్‌లో 3 మ్యాచ్‌లే ఆడగా.. అందులోనూ ఒక సారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఇంకా ఆడిన ఆ ఒక్క మ్యాచ్‌లోనూ అతను 10 పరుగులకే పరిమితమయ్యాడు. అంటే అతను చేసిన ఒక్కో పరుగుకి రాజస్థాన్ టీమ్ రూ.10 లక్షలు చెల్లించింది.
Updated on: May 31, 2023 | 1:55 PM

16వ సీజన్ ఐపీఎల్‌లో టైటిల్ గెలిచే అవకాశం ఉన్న బలమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన రాజస్థాన్ రాయల్స్.. లీగ్‌లోనే తమ పోరాటానికి తెరవేసుకుంది. జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నప్పటికీ రాజస్థాన్ ఈసారి ప్లేఆఫ్స్‌కి చేరలేక 5వ స్థానంలో టోర్నీని ముగించింది.

గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని తన అద్భుత బ్యాటింగ్‌తో ఫైనల్స్‌కు చేర్చి, 4 సెంచరీలతో సంచలనం సృష్టించిన బట్లర్ ఈసారి 5 మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ముఖ్యంగా హెట్‌మేయర్ అయితే శబ్దం కూడా చేయలేదు. అయితే రాజస్థాన్‌కి కలిసొచ్చిన విషయం ఏమిటంటే.. యశస్వీ జైస్వాల్ వంటి యువ బ్యాటర్ తమ వద్ద ఉన్నాడు. రానున్న సీజన్‌లలో అతను రాజస్థాన్ తరఫున రాయల్‌గా ఆడగలడు.

బ్యాటింగ్ విభాగం పక్కన పెడితే బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ అతని గాయం సమస్య రాజస్థాన్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు హెట్‌మేయర్ లాగానే జంపా శబ్దం కూడా చేయలేదు. ఈ నలుగురే కాకుండా రాజస్థాన్ జట్టులో ముఖ్యమైన విదేశీ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బెంచ్‌పై నిరీక్షించాల్సి వచ్చింది. వారిలో ప్రముఖుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్.

ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్‌ను ఫ్రాంచైజీ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఆసక్తి, అనుభవం, ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని రూట్‌కు రాజస్థాన్ జట్టు మరిన్ని అవకాశాలు ఇస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

ఐపీఎల్ తొలి అర్ధభాగంలో ఆడే అవకాశం రాని రూట్.. ఐపీఎల్ రెండో దశలో 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో అతనికి ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అందులో అతను కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

కాగా, ఇంగ్లాండ్ తరఫున జో రూట్ T20 కెరీర్ గురించి మాట్లాడాలంటే.. అతను 32 T20 మ్యాచ్‌లలో 35.72 సగటు, 126.31 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 893 పరుగులు చేశాడు. ఇంకా బ్యాటింగ్‌లో 5 అర్ధసెంచరీలు.. బౌలింగ్‌లో రూట్ 6 వికెట్లు కూడా ఉన్నాయి.





























