- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Top 5 Highest Individual Scores In IPL Final That Ended Up On Losing Side
IPL Final: ఫైనల్‌లో హీరోలే కానీ, టైటిల్ గెలవని అన్‌లక్కీ ప్లేయర్లు.. లిస్టులో చెన్నై ప్లేయర్లు కూడా..
IPL 2023 Final- Sai Sudarshan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 చాంపియన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.
Updated on: May 31, 2023 | 1:58 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 చాంపియన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

ఫలితంగా ఐపీఎల్ క్రికెట్‌లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్(5 ట్రోఫీలు) సరసన నిలిచింది. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు 5 ఐపీఎల్ కప్‌లు గెలవగా... తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా తన 5వ టైటిల్‌ని ఖాతాలో వేసుకుంది.

ఇక ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ తన వీరోచిత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు బాదిన సాయి సుదర్శన్.. 6 సిక్సర్లు కొట్టాడు. ఇలా సుదర్శన్ తన సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిసినా జట్టు మాత్రం టైటిల్ నెగ్గ లేకపోయింది. సుదర్శన్ లాగా ఐపీఎల్ ఫైనల్లో అద్భుత బ్యాటింగ్ చేసినా.. టైటిల్ గెలవని అభాగ్యులు కొందరు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

సురేష్ రైనా: 2012 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోలకతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో సురేశ్ రైనా 38 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో మొత్తం 73 పరుగులు చేశాడు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో రైనా రాణించినా చెన్నై మాత్రం రన్నరప్‌గా నిలిచింది.

వృద్ధిమాన్ సాహా: 2014 ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్, కోలకతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఇందులో పంజాబ్ టీమ్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 55 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో మొత్తం 115 పరుగులు చేశాడు.కానీ ఈ మ్యాచ్‌లో సాహా బాదిన శతకం పంజాబ్ కింగ్స్‌కి ట్రోఫీని కట్టబెట్టలేకపోయింది.

క్రిస్ గేల్: 2016 ఐపీఎల్ ఫైనల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ఈ ఫైనల్ పోరులో ఆర్సీబీ ఓపెనర్ క్రిస్ గేల్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. 208 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ తరఫున గేల్ మెరిసినా.. టీ మ్ మాత్రం 200 పరుగులే చేసి ఓడిపోయింది.

షేన్ వాట్సన్: 2019 ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ 59 బంతుల్లో 80 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడి రన్నరప్ ట్రోఫీతో టోర్నీని ముగించింది.

ఇక తాజాగా మంగళవారం సాయి సుదర్శన్ వంతు వచ్చినట్లుంది. 96 పరుగులు చేసి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించినా.. అటు వర్షం, ఇటు జడేజా విధ్వంసం కారణంగా చెన్నై చేతిలో హార్దిక్ సేన ఓడిపోవాల్సి వచ్చింది. ఫలితంగా ఐపీఎల్ ఫైనల్‌లో సూపర్ ఇన్నింగ్ ఆడినా టైటిల్ గెలవని అభాగ్యుల లిస్టులో సభ్యుడిగా సుదర్శన్ కూడా నిలిచాడు.




