Dhanashree Varma : వాడు నన్ను అమ్మా అనిపిలిచే వాడు.. ఎందుకు వదిలేశాడో అర్థం కావడం లేదన్న చాహల్ భార్య
క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, అతని మాజీ భార్య ధనశ్రీ వర్మల బంధం పెళ్లి నుంచి విడాకుల వరకు వచ్చినా, వారి మధ్య స్నేహం మాత్రం అలాగే ఉంది. తాజాగా, కొరియోగ్రాఫర్-ఫిల్మ్‌మేకర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో ధనశ్రీ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని రహస్యాలను వెల్లడించింది.

Dhanashree Varma : క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని మాజీ భార్య ధనశ్రీ వర్మ మధ్య బంధం విడిపోయినప్పటికీ, వారి స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కొరియోగ్రాఫర్-ఫిల్మ్‌మేకర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో ధనశ్రీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించింది. విడాకుల తర్వాత కూడా ఆమె చాహల్‌తో మాట్లాడుతుందని ఈ సంభాషణలో వెల్లడైంది.
విడాకుల తర్వాత కూడా తాను, చాహల్ మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకుంటామని ధనశ్రీ నవ్వుతూ చెప్పింది. “అతడు నన్ను అమ్మా అని పిలిచేవాడు, చాలా ముద్దుగా పిలిచేవాడు” అని ఆమె చెప్పింది. ఈ మాటలు సోషల్ మీడియాలో అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. వారిద్దరి బంధం భార్యాభర్తలగా ముగిసినప్పటికీ, వారి స్నేహం, అనుబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో చాహల్-ధనశ్రీ వర్మల మధ్య నాలుగేళ్ల బంధం ముగిసింది.
డాక్టర్ నుంచి డ్యాన్సర్ వరకు
ఈ వ్లాగ్‌లో ధనశ్రీ తన కెరీర్ గురించి కూడా కొన్ని ఆశ్చర్యకర విషయాలను పంచుకుంది. డ్యాన్స్, కంటెంట్ క్రియేషన్ ప్రపంచంలోకి రాకముందు తాను ఒక దంత వైద్యురాలు (డెంటిస్ట్) అని ఆమె చెప్పింది. ధనశ్రీ మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాంద్రా, లోఖండ్‌వాలాలో క్లినిక్ కూడా నడిపిందని వెల్లడించింది. ఈ సమయంలో ఆమె చాలా మంది సెలబ్రిటీలకు చికిత్స చేసింది. నటుడు రణబీర్ కపూర్ కూడా ఆమె వద్ద చికిత్స తీసుకున్నవారిలో ఒకడు అని చెప్పింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




