చరిత్ర సృష్టించబోతున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు.. అతి పిన్న వయస్కుడిగా రికార్డ్..!
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహాన్ ఆర్యమాన్ సైతం క్రీడా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు. మంగళవారం(సెప్టెంబర్ 02) జరగనున్న మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) ఎన్నికల్లో మహాన్ ఆర్యమాన్ పోటీ లేకుండా అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. 29 సంవత్సరాల వయసులో, ఆయన MPCA కి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండోర్ చేరుకున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మహాన్ ఆర్యమాన్‌కు ఘన స్వాగతం లభించింది.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహాన్ ఆర్యమాన్ సైతం క్రీడా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు. మంగళవారం(సెప్టెంబర్ 02) జరగనున్న మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) ఎన్నికల్లో మహాన్ ఆర్యమాన్ పోటీ లేకుండా అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. 29 సంవత్సరాల వయసులో, ఆయన MPCA కి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండోర్ చేరుకున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మహాన్ ఆర్యమాన్‌కు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా మహాన్ ఆర్యమాన్ మీడియాతో మాట్లాడిన వీడియోను దిగువన చూడండి…
VIDEO | Indore: Mahanaryaman Scindia, son of Union Minister Jyotiraditya Scindia, elected unopposed as the youngest president of the Madhya Pradesh Cricket Association, says, "All the past presidents have done tremendous work, and I will try to take that legacy forward to make… pic.twitter.com/rWXOGG5wID
— Press Trust of India (@PTI_News) September 2, 2025
ఈ నేపథ్యంలో మహాన్ ఆర్యమాన్ తన సొంత తండ్రి, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రికార్డును బద్దలు కొట్టబోతున్నాడు. ఇప్పటివరకు, MPCA అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడి రికార్డు జ్యోతిరాదిత్య సింధియా పేరు మీద ఉంది. 2006లో 35 సంవత్సరాల వయసులో మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి దివంగత మాధవరావు సింధియా తొలిసారిగా 37 సంవత్సరాల వయసులో MPCA అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. MPCA మొదటి అధ్యక్షుడు మనోహర్ సింగ్ మెహతా, 1957లో బాధ్యతలు స్వీకరించారు.
దేశంలో అతి పిన్న వయస్కుడైన రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆయన 26 సంవత్సరాల వయసులో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం దేశంలో అతి పిన్న వయస్కుడైన రాష్ట్ర క్రికెట్ అధ్యక్షుడు మహాన్ ఆర్యమాన్ కావచ్చు. గోవా ప్రస్తుత అధ్యక్షుడు విపుల్ ఫడ్కే వయసు ప్రస్తుతం 32 సంవత్సరాలు.
సింధియా కుటుంబానికి క్రికెట్ రాజకీయాలతో మూడు తరాల అనుబంధం ఉంది. మహానార్యమన్ తండ్రి జ్యోతిరాదిత్య, తాత మాజీ కేంద్ర మంత్రి దివంగత మాధవరావు సింధియా కూడా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మాధవరావు సింధియా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
క్రికెట్ రాజకీయాల్లో మహాన్ ఆర్యమాన్ పాత్ర మూడు సంవత్సరాల క్రితం రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. 2022 సంవత్సరంలో, అతను గ్వాలియర్ డివిజనల్ క్రికెట్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. దీని తరువాత, గత రెండు సంవత్సరాలుగా అతని నాయకత్వంలో MP క్రికెట్ లీగ్ గొప్ప వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు మూడు సంవత్సరాల ఎన్నికల్లో, ఆయన నేతృత్వంలోని ప్యానెల్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష అభ్యర్థి లేనందున, అందరూ పోటీ లేకుండా ఎన్నికవడం ఖాయం. 68 సంవత్సరాల MPCA చరిత్రలో ఆయన అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు అవుతారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




