Watch Video: 5 సిక్సర్లు, 10 ఫోర్లు.. 271 స్ట్రైక్‌రేట్‌తో లేడీ సెహ్వాగ్ బీభత్సం.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డ్..
Shafali Verma: స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ అద్భుతమైన ఆరంభం అందించారు.
GG vs DC, WPL 2023: ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 9వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో స్నేహ రాణా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ జట్టుకు శుభారంభం లభించలేదు. దక్షిణాఫ్రికా క్రీడాకారిణి మారిజానే కాప్ ధాటికి గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.
గుజరాత్ జెయింగ్స్ కేవలం 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలోనే పైచేయి సాధించింది. ఫలితంగా 7వ ఓవర్ ముగిసే సరికి 4 ఓవర్లు పూర్తి చేసిన మారిజానే కాప్ 15 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
ఆ తర్వాత కిమ్ గార్త్ 32 పరుగుల సహకారం అందించి జట్టును ఆదుకుంది. దీంతో గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 105 పరుగులు మాత్రమే చేసింది.
106 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెగ్ లానింగ్, షఫాలీ వర్మ అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా తన తుఫాన్ బ్యాటింగ్‌తో షెఫాలీ మైదానంలోని ప్రతి మూలకు బౌండరీల వర్షం కురిపించింది. ఫలితంగా షెఫాలీ వర్మ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
MAXIMUM ?@TheShafaliVerma wasting no time in the chase as she has raced to 40* off 15 deliveries!
Follow the match ? https://t.co/ea9cEEkMGR#TATAWPL | #GGvDC | @DelhiCapitals pic.twitter.com/a9x5iYL6U8
— Women’s Premier League (WPL) (@wplt20) March 11, 2023
హాఫ్ సెంచరీ తర్వాత జోరు కొనసాగించిన షెఫాలీ వర్మ.. గుజరాత్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించింది. అలాగే 28 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 10 ఫోర్లతో అజేయంగా 78 పరుగులు చేసింది. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7.1 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, లారా హారిస్, మరిజానే కప్, జెమీమా రోడ్రిగ్జ్, జెస్ జోనాసెన్, తానియా భాటియా (కీపర్), మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, తారా నోరిస్.
గుజరాత్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): సబ్బినేని మేఘన, లారా వోల్వార్డ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, జార్జియా వేర్హామ్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), దయాళన్ హేమలత, స్నేహ్ రాణా (కెప్టెన్), కిమ్ గార్త్, మాన్సీ జోషి, తనూజా కన్వర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..