Video: వికెట్ పడగొట్టాడు.. ఆనందంలో గెంతులేశాడు.. కట్‌చేస్తే.. స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు..

South Africa vs West Indies: సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆఫ్రికన్ స్పిన్నర్‌కు గాయం కావడంతో స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.

Video: వికెట్ పడగొట్టాడు.. ఆనందంలో గెంతులేశాడు.. కట్‌చేస్తే.. స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు..
Keshav Maharaj Injury
Follow us
Venkata Chari

|

Updated on: Mar 12, 2023 | 9:34 AM

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 284 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు బాగా కలిసొచ్చింది. కానీ, ఆ జట్టు స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌కు ఈ మ్యాచ్ అంతగా కలసిరాలేదు. ఈ మ్యాచ్‌లో వికెట్ సెలబ్రేషన్‌ సందర్భంగా మహరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన మ్యాచ్ చివరి రోజు అంటే నాలుగో రోజు జరిగింది.

వికెట్ పడిన సంబరాల్లో..

6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ కైల్ మేయర్స్‌ను ఎల్‌ఎల్‌బీడబ్ల్యూ ద్వారా కేష్ మహరాజ్ పెవిలియన్ చేర్చాడు. 19వ ఓవర్లో మేయర్ వికెట్ పడింది. ఫీల్డ్ అంపైర్ మేయర్స్‌ను ఔట్‌గా ప్రకటించలేదు. ఆ తర్వాత, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా రివ్యూను ఆశ్రయించి తన జట్టు ఖాతాలో మరో వికెట్‌ను చేర్చాడు. దీని తర్వాత మహారాజ్ ఈ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో నేలపై పడిపోయాడు. అతనిని చూడటానికి వైద్య బృందం మైదానం చేరుకుంది. కేశవ మహారాజును స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో కేశవ్ మొత్తం మూడు వికెట్లు తీశాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో, కేశవ్ కేవలం 2.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. అందులో అతను ఒక మెయిడిన్ ఓవర్‌తో 4 పరుగులు ఇచ్చాడు.

సిరీస్‌ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా..

రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా 284 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రికన్ కెప్టెన్ టెంబా బావుమా 20 ఫోర్ల సాయంతో 172 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..