పిల్లబచ్చా కాదు పిడుగులాంటోడు.. కేవలం 18 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. బౌలర్లకు సుస్సునే.!
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రతీ మ్యాచ్‌లోనూ బౌలర్లను సుస్సుపోయిస్తుంటే.. ఇప్పుడు మరో ఆస్ట్రేలియా బ్యాటర్ వచ్చి ఈ లిస్టులో చేరాడు. వీరిద్దరూ కలిసి మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరపున ఓపెనర్లుగా మారనున్నారు. మరి ఇంతకీ అతడెవరో కాదు..

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రతీ మ్యాచ్‌లోనూ బౌలర్లను సుస్సుపోయిస్తుంటే.. ఇప్పుడు మరో ఆస్ట్రేలియా బ్యాటర్ వచ్చి ఈ లిస్టులో చేరాడు. వీరిద్దరూ కలిసి మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరపున ఓపెనర్లుగా మారనున్నారు. మరి ఇంతకీ అతడెవరో కాదు.. కేవలం రూ. 20 లక్షలకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన జెక్ ఫ్రేజర్ మెక్‌గర్క్. ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో పాటు.. ఢిల్లీ జట్టుకు వన్‌డౌన్‌లో దిగిన మెక్‌గర్క్ కూడా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా.. కేవలం 15 బంతుల్లోనే మెక్‌గర్క్ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.
ఒకే ఓవర్‌లో 30 పరుగులు..
సన్‌రైజర్స్ నిర్దేశించిన 267 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి ఢిల్లీకి తుఫాన్ ఆరంభాన్ని ఇచ్చాడు మెక్‌గర్క్. ఈ 22 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ నుంచి దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 3వ ఓవర్‌లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. అలాగే లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే వేసిన ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. దీంతో తన అర్ధ సెంచరీని కేవలం 15 బంతుల్లోనే కంప్లీట్ చేశాడు. ఇది ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ కాగా.. అదే మ్యాచ్ హెడ్ చేసిన 16 బంతుల్లో అర్ధ సెంచరీ రికార్డును కొన్ని గంటల్లోనే బద్దలు కొట్టాడు మెక్‌గర్క్.
కేవలం రూ.20 లక్షలకే..
మెక్‌గర్క్ మొత్తంగా 18 బంతులు ఆడి.. 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. అతడు ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఢిల్లీ జట్టు ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా చేర్చుకుంది. అది కూడా కేవలం రూ. 20 లక్షలకే. కేవలం 3 మ్యాచ్‌లలో తాను ఏంటో నిరూపించుకున్నాడు మెక్‌గర్క్. కాగా, ఆస్ట్రేలియా తరపున టీ20 ప్రపంచకప్‌లో అటు ట్రావిస్ హెడ్, ఇటు మెక్‌గర్క్ ఓపెనింగ్ చేయనున్నారని వార్తలు వస్తుండటంతో.. మిగతా జట్లకు ముందుగానే ఓ హెచ్చరిక పంపించింది ఆసీస్ టీం.
Travis Head doing Travis Head things already 🔥
What a start this for @SunRisers 🧡
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvSRH pic.twitter.com/THLOchmfT2
— IndianPremierLeague (@IPL) April 20, 2024
Intent + Execution Pro Max Ultra Tonight. Well Played, JFM 🔥 pic.twitter.com/6ajneRf82G
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2024




