ఏంటీ.? ఒకప్పుడు రోహిత్ లవ్‌లో పడింది ఈ బ్యూటీతోనా.! ఎంతలా మారిపోయిందో తెల్సా..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఐదుసార్లు టైటిల్ అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. లీగ్ తొలినాళ్లలో గిల్‌క్రిస్ట్ సారధ్యం వహించిన డెక్కన్ ఛార్జర్స్ టీంలో ఆడిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్లు గడుస్తున్న డెక్కన్ ఛార్జర్స్‌తో తనకున్న బాండింగ్ చాలా స్పెషల్ అని తాజాగా రోహిత్ శర్మ..

ఏంటీ.? ఒకప్పుడు రోహిత్ లవ్‌లో పడింది ఈ బ్యూటీతోనా.! ఎంతలా మారిపోయిందో తెల్సా..
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 21, 2024 | 1:37 PM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఐదుసార్లు టైటిల్ అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. లీగ్ తొలినాళ్లలో గిల్‌క్రిస్ట్ సారధ్యం వహించిన డెక్కన్ ఛార్జర్స్ టీంలో ఆడిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్లు గడుస్తున్న డెక్కన్ ఛార్జర్స్‌తో తనకున్న బాండింగ్ చాలా స్పెషల్ అని తాజాగా రోహిత్ శర్మ.. గిల్‌క్రిస్ట్‌తో జరిగిన చిట్‌చాట్‌లో తెలిపాడు. ఇక ఆ సమయంలో ఓ బ్యూటీ రోహిత్‌ను రాజులా చూసుకుంది. అంతేకాదు ఆమె అందానికి మన హిట్‌మ్యాన్ కూడా ఫిదా అయిపోయాడు. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు డీసీ ఓనర్ టి. వెంకట్రామ్ రెడ్డి కూతురు గాయత్రి రెడ్డి. ఆ సమయంలో రోహిత్-గాయత్రి మధ్య మంచి బాండింగ్ ఉండేది. తక్కువ సమయంలో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

డెక్కన్ ఛార్జర్స్‌ మ్యాచ్‌లన్నీ చూసేందుకు గాయత్రి రెడ్డి తరచూ స్టేడియం‌కు వచ్చేది. గ్రౌండ్‌లో రోహిత్ శర్మతో సరదా మాట్లాడుతూ కనిపించేది. మొత్తం టీంతో పాటు రోహిత్ శర్మను కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. అప్పట్లో రోహిత్ శర్మ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. అతడిలో ఫ్యూచర్ సూపర్‌స్టర్‌ను.. బాగా ప్రోత్సహించింది గాయత్రి రెడ్డినే.. అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇక వీరిద్దరి బాండింగ్ అప్పట్లో పెద్ద సంచలనమే అని చెప్పాలి. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ నుంచి మంచి ఆఫర్ రావడంతో.. ఆ టీంలోకి వెళ్లాడు రోహిత్ శర్మ. కాగా, ఇటీవల గిల్‌క్రిస్ట్‌తో జరిగిన చిట్‌చాట్‌లో ఇప్పటిదాకా ఐపీఎల్‌లో డీసీ థీమ్ సాంగ్‌ను ఏది బీట్ చేయలేదని.. అది అంటే తనకు చాలా ఇష్టమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఆ కామెంట్స్ గాయత్రి రెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.