MS Dhoni: ట్రెడిషనల్ ఎటైర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ధోని.. ఫ్యాన్స్‌కు మాటల్లేవంతే..
MS Dhoni Traditional Attire: ఓ వైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న సంగతి తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం, టీమిండియా మాజీ ప్లేయర్ ఎంఎస్ ధోని తన లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సంచలనంగా మారింది.

IPL 2025: మార్చి 9న న్యూజిలాండ్‌తో జరుగుతోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో టీమిండియా తలపడుతోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అందరి చూపు దుబాయ్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌పైనే నెలకొంది. అయితే, ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని తలా మ్యాజిక్‌తో అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. చెన్నై ఫ్రాంచైజీ పట్ల తనకున్న అభిమానానికి పేరుగాంచిన ధోని స్థానిక సంప్రదాయాన్ని తనలో ఇముడ్చుకున్నాడు.
మైదానంలో కెప్టెన్ కూల్‌గా పేరుగాంచిన ధోని.. బ్యాటింగ్‌లో మాత్రం ధనాధన్ షాట్లతో తుఫాన్ ఫినిషర్‌గా పెరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐకాన్, తమిళ సంప్రదాయాన్ని స్వీకరించి అభిమానులకు అదిరిపోయే ట్వీట్ ఇచ్చాడు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
తనదైన శైలిలో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ధోని..
View this post on Instagram
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వచ్చిన ఒక వైరల్ పోస్ట్ అభిమానులకు మస్త్ కిక్ ఇచ్చేలా చేసింది. ఇందులో ధోని క్లాసిక్ సౌత్ ఇండియన్ లుక్‌లో అదరగొట్టాడు. తెల్లటి చొక్కా, పంచెతోపాటు సిగ్నేచర్ సన్ గ్లాసెస్‌తో దుమ్మురేపాడు.
ఈ క్రమంలో “43 ఏళ్ల యువ వికెట్ కీపర్ తిరిగి వచ్చాడు” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తమిళ పండుగలు, సీఎస్‌కే ఈవెంట్లలో ప్రధానమైన దుస్తులలో ధోని కనిపించడంతో తమిళనాడుతో అతని బంధాన్ని పునరుద్ఘాటించిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
IPL 2025 కి ధోని రెడీ..!
తమిళ సంస్కృతి పట్ల ధోనీకి ఉన్న అనుబంధం రహస్యం కాదు. భారత్, కివీస్ ఫైనల్‌కు కొన్ని గంటల ముందు ధోనీ పోస్ట్, క్రికెట్ సాంస్కృతిక రాయబారిగా అతని పాత్రను బలపరుస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. చెన్నై టీం ఐపీఎల్ (IPL 2025) రాబోయే సీజన్ కోసం బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంది. మార్చి 23న ముంబై ఇండియన్స్‌తో తమ తొలి మ్యాచ్, అలాగే మార్చి 28న బెంగళూరుతో రెండో మ్యాచ్‌ను చెన్నైలో ఆడేందుకు సిద్ధమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








