AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy: రంజీలో రంకెలేస్తోన్న సీఎస్‌కే 18 ఏళ్ల సెన్సెషన్.. తుఫాన్ సెంచరీతో ఊచకోత

Andre Siddarth Century: రంజీ ట్రోఫీలో తమిళనాడు యువ బ్యాట్స్‌మెన్ ఆండ్రీ సిద్ధార్థ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి 106 పరుగులు చేశాడు. తమిళనాడు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 3 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో సెంచరీ చేసి జట్టును 301 పరుగులకు చేర్చాడు.

Ranji Trophy: రంజీలో రంకెలేస్తోన్న సీఎస్‌కే 18 ఏళ్ల సెన్సెషన్.. తుఫాన్ సెంచరీతో ఊచకోత
Andre Siddarth Century
Venkata Chari
|

Updated on: Jan 24, 2025 | 9:16 AM

Share

Andre Siddarth Century: ఆండ్రీ సిద్ధార్థ్.. ఈ పేరు గుర్తుంచుకునే లిస్ట్‌లో చేరేలా ఉంది. ఎందుకంటే అతను భవిష్యత్ సూపర్ స్టార్‌గా మారే ఛాన్స్ ఉంది. అవును, ఈ 18 ఏళ్ల ఆటగాడిపై చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఈ క్రమంలో ఈ యంగ్ ప్లేయర్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రీ సిద్ధార్థ్ అద్భుత సెంచరీ చేశాడు. సిద్ధార్థ్ 106 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సిద్ధార్థ్ ఈ సెంచరీ ప్రత్యేకం. ఎందుకంటే, అతను తన జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అతను ఈ ఇన్నింగ్స్ ఆడాడు.

ఆండ్రీ సిద్ధార్థ్ అద్భుతం..

జగదీషన్, విజయ్ శంకర్ వంటి ఆటగాళ్లు ఔటవడంతో చెన్నై జట్టు 126 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన ఆండ్రీ సిద్ధార్థ్ ఓపెన్‌గా బ్యాటింగ్ చేస్తూ చండీగఢ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆండ్రీ సిద్ధార్థ్ టోటల్ ఎటాక్ వ్యూహాన్ని అనుసరించి తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. సిద్ధార్థ్‌ ఈ ఇన్నింగ్స్‌ ఆధారంగా తమిళనాడు స్కోరు 300 పరుగులు దాటేసింది.

సిద్ధార్థ్ తన సత్తా చాటాడు..

ఆండ్రీ సిద్ధార్థ్ ఈ సీజన్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి 95.6 సగటుతో 478 పరుగులు చేశాడు. సిద్ధార్థ్ ప్రతి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సహకారం అందించాడు. అతను గత 7 ఇన్నింగ్స్‌లలో 4 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. ఒకసారి అస్సాంపై సెంచరీ కూడా కోల్పోయాడు. 94 పరుగుల వద్ద ఈ ఆటగాడు ఔటయ్యాడు. ఆండ్రీ సిద్ధార్థ్ కూడా గత ఏడాది డిసెంబర్‌లో అండర్ 19 ఆసియా కప్ ఆడాడు. అక్కడ అతను భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. అయితే, ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతనిపై పందెం వేసింది. ఈ ప్లేయర్ బేస్ ధర రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.

సిద్ధార్థ్ తమిళనాడు మాజీ బ్యాట్స్‌మెన్ శ్రీధరన్ శరత్ మేనల్లుడు. శరత్ తమిళనాడు తరపున 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 51.17 సగటుతో 8700 పరుగులు చేశాడు. శరత్‌కు 27 ఫస్ట్ క్లాస్ సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..