Insurance Tips: ఇన్యూనెన్స్ తీసుకుంటున్నారా..? ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే డేంజర్‌లో పడతారు
ఇన్యూరెన్స్‌లు ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మార్కెట్‌గా మారింది. ప్రతీదానికి ఏదోక ఇన్యూరెన్స్ ఉంది. భవిష్యత్ భద్రత కోసం చాలామంది ఇన్యూరెన్స్‌లు తీసుకుంటున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరిగియింది. ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటివి ఎంచుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం రండి.

ఈ రోజుల్లో ఇన్యూరెన్స్ అనేది అందరికీ అవసరమే.. దీని వల్ల డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. ఇప్పట్లో మార్కెట్‌లో అనేక బీమాలు ఉన్నాయి. ప్రతీ దానికి రక్షణకు ఇన్యూరెన్స్‌లు ఉన్నాయి. హెల్త్ ఇన్యూరెన్స్, లైఫ్ ఇన్యూరెన్స్, వెహికల్ ఇన్యూరెన్స్, హోమ్ ఇన్యూరెన్స్.. ఇలా ప్రతీదానికి రక్షణ ఇచ్చేందుకు బీమా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్యూరెన్స్‌లు తీసుకోవడం చాలా ఎక్కువైంది. అందుకే రకరకాల ఇన్యూరెన్స్ కంపెనీలు కూడా కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అనేక బీమా స్కీమ్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇన్యూరెన్స్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయితే ఏదైనా ఇన్యూరెన్స్ తీసుకుటేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం.
పాలసీలను పోల్చి చూసుకోండి
మీరు ఏదైనా ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు వివిధ కంపెనీల పాలసీలను పోల్చి చూసుకోండి. బీమా ఏజెంట్లు వాళ్ల టార్కెట్లు, స్వలాభం కోసం మీ అవసరాలకు సరిపోయే పాలసీని రికమెండ్ చేయకపోవచ్చు. అందుకే మీరే ఆన్‌లైన్‌లో వివిధ కంపెనీల పాలసీలను ఒకదానితో ఒకటి పోల్చి చూసుకోండి. మీ బడ్జెట్, అసరాలకు అనుగుణంగా మీరే నిపుణుల అభిప్రాయం తెలుసుకుని తీసుకోండి. మొత్తం ఏజెంట్లపైనే ఆధారపడటం అసలు మంచిది కాదు.
పాలసీ వివరాలు చదవండి
చాలామంది ఏదైనా పాలసీ తీసుకుటేప్పుడు డాక్యుమెంట్లలోని నియమ, నిబంధనలు సరిగ్గా చదవరు. దీని వల్ల మీరు క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పాలసీ వేటికి వర్తిస్తుంది.. దేనిక వర్తించదు.. దేనికి ఎంత లిమిట్ వస్తుంది అనే వివరాలు స్పష్టంగా తెలుసుకోండి. పాలసీ డాక్యుమెంట్లలోని ప్రతీ పాయింట్‌ను పూర్తిగా అర్ధం చేసుకున్న తర్వాతే తీసుకోండి. లేకపోతే క్లెయిమ్ సమయంలో వర్తించకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముంది.
భవిష్యత్ అవసరాలు గుర్తించండి
మీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మొదట్లోనే మంచి పాలసీని తీసుకోండి. ఉదాహరణకు మీరు భవిష్యత్తులో ఏదైనా పని మొదలుపెట్టాలనుకుంటున్నారు.. లేదా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లేదా ఇంకేదైనా చేయాలనుకుంటున్నారు అనుకోండి.. వాటికి అనుగుణంగా సరిపోయే పాలసీని ముందే తీసుకోండి. దీని వల్ల మీరు భవిష్యత్తులో ప్రతీసారి పాలసీ మార్చుకోకుండా ఒకే పాలసీ మీద ఆధారపడవచ్చు. అందుకే తీసుకునేటప్పుడే మీ భవిష్యత్ అవసరాలను గుర్తించి పాలసీని నిర్ణయించుకోండి.
క్లెయిమ్ వేగవంతం
కొన్ని బీమా కంపెనీలు క్లెయిమ్ సమయంలో ఎక్కువ సమయం తీసుకుంటాయి. అత్యవసర సమయంలో వేగంగా క్లెయిమ్ చేయరు. రకరకాల కారణాలు చెబుతూ ఉంటాయి. దీంతో క్లెయిమ్ వేగవంతంగా చేసే కంపెనీలను ఎంచుకోండి. అలాగే క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉన్న బీమా కంపెనీల పాలసీలను తీసుకోండి. దీని వల్ల మీకు అత్యవసర సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా క్లెయిమ్ పొందవచ్చు.
రైడర్లు ఎంచుకోండి
మీరు ఏదైనా పాలసీ తీసుకుటేప్పుడు సరైన రైడర్లను ఎంచుకోండి. రైడర్లు అంటే మీ పాలసీకి అదనపు ప్రయోజనాలను అందించేవి అని అర్థం. బేసిక్ పాలసీపై మనం ఈ రైడర్లను జోడించుకోవచ్చు. ఇందుకోసం కొంత మొత్తంలో అదనపు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. సరైన రైడర్లను ఎంచుకోవడం వల్ల మీరు ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ప్రీమియం మాఫీ వంటి అనేక అదనపు ప్రయోజనాలను రైడర్ల వల్ల పొందవచ్చు.
