సొంత టీం వద్దంది.. ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 39 ఏజ్‌లో సెంచరీతో కోహ్లీకి దమ్కీ ఇచ్చిన రిటైర్డ్ ‘బుల్’!
వయసు కేవలం అంకె మాత్రమే అని ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ మరోసారి నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, ఐపీఎల్ వంటి భారీ లీగ్స్ తనను పట్టించుకోకపోయినా, తనలో పస తగ్గలేదని చాటిచెప్పాడు. తాజాగా బిగ్ బాష్ లీగ్ (BBL 15) లో సిడ్నీ థండర్ తరపున ఆడుతూ, ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ కళ్లు చెదిరే సెంచరీతో వార్నర్ సంచలనం సృష్టించాడు.

David Warner: క్రికెట్ ప్రపంచంలో ‘ది బుల్’ అని పిలవబడే డేవిడ్ వార్నర్, తన బ్యాట్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. గత కొంతకాలంగా వార్నర్ ఫామ్, ఫిట్‌నెస్‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తనను పక్కన పెట్టడం, సొంత జట్లు కూడా ఆసక్తి చూపకపోవడంతో వార్నర్ పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ, బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్లో వార్నర్ విశ్వరూపం ప్రదర్శించాడు.
మైదానంలో విధ్వంసం.. సిడ్నీ థండర్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో వార్నర్ ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. కేవలం బౌండరీలే లక్ష్యంగా సాగిన ఈ ఇన్నింగ్స్‌లో వార్నర్ 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. మైదానం నలుమూలలా తనదైన శైలిలో షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే మూడంకెల స్కోరును (Century) అందుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. వార్త రాసే సమయానికి వార్నర్ టీం 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. చివరి వరకు నాటౌట్ గా నిలిచిన డేవిడ్ వార్నర్ 110 పరుగులతో నిలిచాడు.
రికార్డుల వేట.. ఈ సెంచరీ డేవిడ్ వార్నర్‌కు బిగ్ బాష్ లీగ్ చరిత్రలో సుమారు 14 ఏళ్ల తర్వాత లభించిన రెండో సెంచరీ కావడం విశేషం. చివరిసారిగా 2011లో ఆయన ఈ లీగ్‌లో సెంచరీ సాధించాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇంతటి పట్టుదలతో ఆడటం వార్నర్ వృత్తిగత నిబద్ధతకు నిదర్శనం. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ 3వ స్థానానికి చేరు మరింత మెరుగుపరుచుకున్నాడు.
🚨 David Warner, 39, rolls back the years with his 3rd BBL hundred! 🚨
That’s his second century in 2026 — still ice-cold 🥶#Davidwarner #BBL2026 #INDvsNZ#IPL2026 #T20WorldCup2026 pic.twitter.com/3vOo0v3frq
— SAHIL NAGPAL (@Pavilionpulse) January 16, 2026
విమర్శకులకు సమాధానం.. “వార్నర్ పని అయిపోయింది” అన్న వారికి ఈ ఇన్నింగ్స్ ఒక గట్టి సమాధానం. ఐపీఎల్ వేలంలో తనను పట్టించుకోని జట్లకు, తాను ఇంకా మ్యాచ్ విన్నర్‌నే అని ఈ సెంచరీ ద్వారా సంకేతాలు పంపాడు. కేవలం పరుగులే కాదు, తన అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రత్యర్థి జట్టు ఆత్మవిశ్వాసాన్ని వార్నర్ దెబ్బతీశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




