- Telugu News Photo Gallery Cricket photos Team India Former Player Virender sehwag earned 2 crore per month more than Rohit sharma in 2024
రిటైర్మెంట్ చేసి 10 ఏళ్లు.. కట్‌చేస్తే.. సెహ్వాగ్ నెట్ వర్త్ ఎంతో తెలిస్తే రోహిత్ కూడా షాక్ అవ్వాల్సిందే?
Virender Sehwag Net Worth: ప్రస్తుత కాలపు దిగ్గజ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకరు. అందువల్ల అతని వార్షిక ఆదాయం కూడా విపరీతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, భారత జట్టు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంపాదన మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పదేళ్లుగా క్రికెట్‌కు దూరమైనా రోహిత్ కంటే అతని వద్ద ఎక్కువ డబ్బు ఉండడం గమనార్హం.
Updated on: Jan 24, 2025 | 10:37 AM

Virender Sehwag Net Worth: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారతదేశంలో కాదు.. ప్రపంచానికి చెందిన దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అయితే, రోహిత్ సంపాదన కూడా అంతే భారీగా ఉంటుంది. అయితే, భారత జట్టు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంపాదన మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది.

సెహ్వాగ్ 2015లోనే ఈ ఆటకు గుడ్‌బై చెప్పాడు. అతను క్రికెట్‌ను విడిచిపెట్టి 10 సంవత్సరాలు గడిచాయి. అయినప్పటికీ అతని వద్ద ప్రస్తుత భారత కెప్టెన్ కంటే ఎక్కువ డబ్బు ఉంది. అతను గత సంవత్సరం ఎంత డబ్బు సంపాదించాడు. అతని ప్రస్తుత సంపద ఎంతో ఓసారి చూద్దాం..?

ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. మీడియా నివేదికల ప్రకారం, భారత జట్టు మాజీ తుఫాన్ ఓపెనర్ గత ఏడాది అంటే 2024లో రూ. 30 కోట్లకు పైగా సంపాదించాడు. ప్రతి నెలా అతని ఆదాయం దాదాపు రూ.2 కోట్లుగా మారింది. మరోవైపు ప్రస్తుత టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గురించి మాట్లాడితే అతను ఐపీఎల్ 2025 కోసం రూ. 16.30 కోట్లు, బీసీసీఐ నుంచి రూ. 7 కోట్లు పొందాడు.

రోహిత్‌కు ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే నుంచి రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు ఫీజుగా లభిస్తోంది. బ్రాండ్ ప్రమోషన్ ద్వారా కూడా కోట్లు సంపాదించాడు. ఈ విధంగా కూడా రూ.35 నుంచి రూ.40 కోట్లు రాబట్టినట్లు అంచనా. వార్షిక సంపాదనలో రోహిత్ ముందున్నప్పటికీ, మొత్తం సంపద విషయంలో మాత్రం సెహ్వాగ్ అతడిని వెనకేసుకొచ్చాడు. రిపోర్టు ప్రకారం రోహిత్ మొత్తం సంపద దాదాపు రూ.214 కోట్లుగా ఉంది. సెహ్వాగ్ మొత్తం సంపద రూ.370 కోట్లు అంటే రోహిత్ కంటే అతని వద్ద ఎక్కువ డబ్బు ఉందన్నమాట.

వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కు దూరమైనప్పటికీ, అతని ఆదాయానికి అదే ప్రధాన వనరు. నిజానికి క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో టీవీల్లో వ్యాఖ్యానం ద్వారా, క్రికెట్ ఎక్స్‌పర్ట్‌గా విశ్లేషణల ద్వారా కూడా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇది కాకుండా, అతను టీవీ షోల నుంచి కూడా సంపాదిస్తున్నాడు. సెహ్వాగ్ సోషల్ మీడియా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుంచి కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. నివేదిక ప్రకారం, సెహ్వాగ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ.26 కోట్లు సంపాదిస్తున్నాడు. దీని ఆధారంగా రూ.370 కోట్ల సంపద సృష్టించాడు.




