AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ 35 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన టెన్త్ స్టూడెంట్.. అదేంటంటే?

Ranji Trophy: 2024-25 రంజీ ట్రోఫీలో 16 ఏళ్ల అంకిత్ ఛటర్జీ బెంగాల్ తరపున ఆడడం ద్వారా సౌరవ్ గంగూలీ 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన బెంగాల్‌కు చెందిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా అంకిత్ ఛటర్జీ నిలిచాడు. ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ 35 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన టెన్త్ స్టూడెంట్.. అదేంటంటే?
Ranji Trophy Ankith
Venkata Chari
|

Updated on: Jan 24, 2025 | 8:50 AM

Share

Ankit Chatterjee: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25 లీగ్ దశ రెండో దశ ఈరోజు ప్రారంభమైంది. చాలా ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. బీసీసీఐ నుంచి వచ్చిన సూచనల మేరకు టీమిండియా వెటరన్‌లు రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చారు. ఇలా అందరి దృష్టి ఈ స్టార్ ప్లేయర్లపై కేంద్రీకృతమై ఉండగా.. 16 ఏళ్ల యువ క్రికెటర్ అద్భుత రికార్డు సృష్టించాడు. వెటరన్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును 10వ తరగతి విద్యార్థి అంకిత్ ఛటర్జీ బద్దలు కొట్టాడు.

రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలో బెంగాల్, హర్యానా జట్లు తలపడ్డాయి. తొలి రోజు బెంగాల్ బౌలర్లు ధాటిగా దూకుడుతో హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 157 పరుగులకే ఆలౌటైంది. బెంగాల్ బౌలర్ల అద్భుతం కంటే ముందు అంకిత్ ఛటర్జీ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. నిజానికి మైదానంలో అడుగుపెట్టిన వెంటనే బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా అంకిత్ నిలిచాడు.

35 ఏళ్ల రికార్డు బద్దలు..

ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన అంకిత్ 15 ఏళ్ల 361 రోజుల వయసులో బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దీంతో బెంగాల్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును అంకిత్ బద్దలు కొట్టాడు. 35 ఏళ్ల క్రితం 17 ఏళ్ల వయసులో 1990 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో గంగూలీ అరంగేట్రం చేయడంతోపాటు, బెంగాల్ టైటిల్ విజయంలో భాగమయ్యాడు. ఇప్పుడు గంగూలీ రికార్డును అంకిత్ బద్దలు కొట్టాడు. విశేషమేమిటంటే అంకిత్ పుట్టినరోజు (జనవరి 27)కి ముందే ఈ ఘనత సాధించాడు.

జూనియర్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన..

అంకిత్ ప్రస్తుతం బెంగాల్‌లోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల వినూ మన్కడ్ ట్రోఫీలో తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సమయంలో అతను 42 సగటుతో 376 పరుగులు చేశాడు. అంతేకాకుండా, 2024లో జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీలో అతని బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిసింది. ఈ టోర్నీలో అతను 41 సగటుతో 325 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..