AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Retirement: ధోని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?

MS Dhoni Retirement: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ నుంచి ఇదే ధోనీకి చివరి మ్యాచ్ అని చర్చ జరిగింది. వీటన్నింటి మధ్య ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి CSK మేనేజ్మెంట్ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

MS Dhoni Retirement: ధోని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ms dhoni
Venkata Chari
|

Updated on: May 20, 2024 | 12:58 PM

Share

MS Dhoni Retirement: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ నుంచి ఇదే ధోనీకి చివరి మ్యాచ్ అని చర్చ జరిగింది. వీటన్నింటి మధ్య ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి CSK మేనేజ్మెంట్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. దీనిపై ఇప్పటి వరకు ధోనీ మేనేజ్‌మెంట్‌కు ఏమీ చెప్పలేదని తెలిపింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓటమి తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు CSK కోసం ఎంఎస్ ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అని మాట్లాడుకుంటున్నారు. ఇకపై ధోనీ ఐపీఎల్‌లో ఆడడని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి, సీజన్ ప్రారంభానికి ముందే, IPL 2024 సీజన్ ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ధోనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మాత్రం చెప్పలేం. ఎంఎస్ ధోని గాయం ఉన్నప్పటికీ సీజన్ మొత్తం ఆడాడు. అందుకే RCBతో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ చివరి లీగ్ మ్యాచ్ కూడా MS ధోని IPLలో చివరి లీగ్ మ్యాచ్ అని అభిమానులు భావిస్తున్నారు.

వేచి ఉంటాం: చెన్నై మేనేజ్మెంట్..

ఇన్ని ఊహాగానాల మధ్య చాలా రకాల అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. అంతకుముందు, ధోని రిటైర్మెంట్ వార్తలను CSK బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తోసిపుచ్చారు. ఇప్పుడు మరో పెద్ద అప్‌డేట్ వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, చెన్నై సూపర్ కింగ్స్ అధికారి మాట్లాడుతూ, ఎంఎస్ ధోని రిటైర్ అవుతున్నట్లు సీఎస్‌కేలో ఎవరికీ చెప్పలేదు. కొన్ని నెలలు వేచి చూడాలని, ఆపై తుది నిర్ణయం తీసుకుంటానని యాజమాన్యానికి చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎంఎస్ ధోని రిటైర్మెంట్ వార్తలను CSK బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తిరస్కరించారు. ధోని గురించి ఊహాగానాలు చేయడం పిచ్చి పని అని అన్నాడు. తాను ఏం చేయబోతున్నాడో మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమే తెలుసునని అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
200 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం.. వన్డే డెబ్యూలోనే భారీ రికార్డ్..
200 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం.. వన్డే డెబ్యూలోనే భారీ రికార్డ్..