Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fridge Tips: వీటిని ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? విషమే.. తస్మాత్‌ జాగ్రత్త !

Fridge Tips: ఫ్రిడ్జ్‌లో ఫుడ్ పాయిజనింగ్‌కు గురికావడం వల్ల కొంత మంది తెలిసో తెలియకో చేసే పొరపాట్లే కారణం. వీటిని తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ 4 రకాల ఆహారాన్ని ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదని నిపునులు చెబుతున్నారు. మీరు ఈ తప్పులు చేస్తుంటే, ఈ రోజు నుంచే ఆపేయండి..

Fridge Tips: వీటిని ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? విషమే.. తస్మాత్‌ జాగ్రత్త !
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jan 20, 2025 | 10:30 PM

చాలా మంది ప్రజలు వంట నుండి ఇంటి పనుల వరకు వివిధ రకాల ఉపకరణాలను ఉపయోగిస్తారు. వంటగదిలో ఆహార పదార్థాలు పాడవకుండా ఉండటానికి రిఫ్రిజిరేటర్ల మాదిరిగానే వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు దాదాపు ప్రతి ఇంట్లోనూ వినియోగిస్తున్నారు. అయితే ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారంటే పలు విషయాలు తెలుసుకోవడం మంచిది. లేకుంటే మీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఫ్రిజ్‌లో ఏయే పదార్థాలను నిల్వ చేయాలో ముందుగా తెలుసుకోండి. ఫ్రిజ్‌ను సరిగ్గా ఉపయోగించకుంటే అది మీ ఆరోగ్యానికి మరింత ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్రిడ్జ్‌లో ఫుడ్ పాయిజనింగ్‌కు గురికావడం వల్ల కొంత మంది తెలిసో తెలియకో చేసే పొరపాట్లే కారణం. వీటిని తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ 4 రకాల ఆహారాన్ని ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదని నిపునులు చెబుతున్నారు. మీరు ఈ తప్పులు చేస్తుంటే, ఈ రోజు నుంచే ఆపేయండి.

  1. ఉల్లిపాయ: ఉల్లిపాయలు తేమ, వాయువులను విడుదల చేస్తాయి. తరిగిన ఉల్లిపాయలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని ఎప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. వాటిని ఎల్లప్పుడూ చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి. తరిగిన ఉల్లిపాయలను గాలి చొరబడని కంటైనర్‌లో భద్రపరుచుకోండి. అవసరమైన విధంగా ఉపయోగించండి.
  2. వెల్లుల్లి: ఒలిచిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వెల్లుల్లి ఫ్రిజ్‌లో ఉంచితే దాని రుచి, పోషకాలను కోల్పోతుంది. వెల్లుల్లిని నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం చల్లని, పొడి, బాగా వెంటిలేషన్ ప్రాంతంలో ఉంచడం. కానీ ఒలిచిన లేదా తరిగిన వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్‌లో గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయవచ్చు.
  3. అల్లం: లా మంది అల్లం తాజాగా ఉండేందుకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచుతారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అలా చేయడం వల్ల అల్లం మీద ఫంగస్ పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాలు, కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని ఎప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదంటున్నారు.
  4. అన్నం: వండిన అన్నాన్ని 24 గంటలకు పైగా రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే అది విషపూరితమవుతుంది. ఇది బ్యాక్టీరియాకు సరైన సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది. అన్నం అదే రోజు తింటే మంచిది

ఆహారాన్ని శీతలీకరించడం ఎలా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన ఆహారం కోసం కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. వీలైనంత వరకు వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోండి. అలా ఉంచినా ఒక్కరోజులోనే ఖాళీ చేయాలి. వండిన ఆహారాన్ని రోజుల తరబడి ఉంచడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే, వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కొన్ని ఆహారాలు చల్లారిన తర్వాతే ఉంచడం మంచిదంటున్నారు నిపుణులు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి