- Telugu News Photo Gallery Chewing one tulsi leaf daily is enough to control diabetes, Check Here is Details
Tulsi for Diabetes: రోజూ ఒక్క తులసి ఆకు నమిలితే చాలు.. డయాబెటీస్ కంట్రోల్!
తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ ఆకులతో చాలా రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల్ని సైతం అదుపు చేసే శక్తి తులసి ఆకులకు ఉంది. ప్రతి రోజూ ఒక్క తులసి ఆకు నమిలి తిన్నా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Jan 20, 2025 | 11:00 PM

తులసిని హిందువులు ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటారు. తులసి మొక్క సర్వ రోగ నివారిణిగా పని చేస్తుంది. తులసి ఆకులతో సీజనల్ వ్యాధులే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను సైతం కంట్రోల్ చేయవచ్చు.

ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది మహమ్మారిలా మారింది. ప్రతీ ఐదుగురిలో ఇద్దరు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధిని కేవలం ఆహారంతో మాత్రమే కంట్రోల్ చేయగలం.

టైప్ - 2 డయాబెటీస్‌తో బాధ పడేవారికి తులసి ఆకులు ఎంతో చక్కగా పని చేస్తాయి. ప్రతి రోజూ ఒక తులసి ఆకు పరగడుపున నమలడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒక తులసి ఆకు నమలడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. తులసి ఆకులను మరిగించిన నీళ్లు తీసుకున్నా చక్కగా పని చేస్తుంది. తులసి గింజలు తీసుకున్నా డయాబెటీస్‌ను అదుపు చేయవచ్చు.

తులసి ఆకులు ఇన్సులిన్ గ్రంథి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ అనేవి పెరగవు. తులసి ఆకులు నమిలి తినడం వల్ల రక్త పోటు, అధిక బరువు, హై కొలెస్ట్రాల్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























