- Telugu News Photo Gallery Cinema photos Who are the most popular female stars in the Indian film industry?
ఇండియాలో టాప్ 10 హీరోయిన్స్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్థాయి రోజు రోజుకు పెరుగుతోంది. అంతే కాకుండా యంగ్ హీరో, హీరోయిన్స్ సైతం భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఓ సంస్థ డిసెంబర్ 2024 వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరంటూ సర్వే చేయగా అందులో సమంత టాప్‌లో నిలిచింది. కాగా, 10 టాప్ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
Updated on: Jan 21, 2025 | 7:40 AM

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ, అనతికాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఇండియాలో ఇండస్ట్రీలో మోస్టు పాపులర్ ఫిమేల్ స్టార్స్‌లో టాప్ 1లోని లిచింది.

అందాల ముద్దుగుమ్మ అలియా భట్, రెండో స్థానంలో నిలిచింది. ఈ అమ్మడు త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు అభిమానులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరని, ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో మూడో స్థానంలో దీపిక పదుకొనె ఉన్నారు.

ఇక పుష్ప2 సినిమాతో మంచి ఫామ్‌లో ఉన్న రష్మిక మందన నాలుగో స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.

ఇక సాయిపల్లవి ఐదవ స్థానంలో, త్రిష ఆరవ స్థానంలో, నయనతార ఏడవ స్థానంలో, కాజల్ అగర్వాల్ ఎనిమిదవ స్థానంలో, శ్రీలీల తొమ్మిదొవ స్థానంలో, శ్రద్ధాకపూర్ 10 వస్థానంలో ఉన్నారు.