Pushpa 2 Reload: పుష్ప 2 రీ లోడెడ్ ప్లాన్ సక్సెస్ అయిందా
పుష్ప 2 ప్లాన్ వర్కవుట్ అయిందా..? రీ లోడెడ్ వర్షన్‌తో మేకర్స్ అనుకున్నది సాధిస్తారా..? 43 రోజుల తర్వాత విడుదలైన కొత్త పుష్ప ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా..? ఎప్పట్నుంచో కలలు కంటున్న 2000 కోట్ల క్లబ్బులో పుష్ప రాజ్ అడుగు పెడతాడా..? రీ లోడెడ్‌తో థియేటర్స్ మళ్లీ ప్రేక్షకులతో లోడ్ అవుతున్నాయా లేదా..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jan 20, 2025 | 7:58 PM

ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా 10 రోజులకే థియెట్రికల్ రన్ పూర్తవుతుంది.. నెల రోజులకే ఓటిటిలో వచ్చేస్తుంది. కానీ పుష్ప 2 మాత్రం ప్రత్యేకమే.

విడుదలై 44 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ చిత్రం వసూళ్లు తీసుకొస్తూనే ఉంది. వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం. ఓ వైపు సంక్రాంతి సినిమాలొచ్చినా.. పుష్ప మాత్రం తగ్గేదే లే అంటున్నాడు.

పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 1860 కోట్లకు పైగా వసూలు చేసింది. నేడో రేపో 1900 కోట్ల క్లబ్బులోకి కూడా అడుగు పెట్టడం ఖాయం. సరిగ్గా ఇదే సమయంలో రీ లోడెడ్ అంటూ 20 నిమిషాలు ఫుటేజ్ కలిపి మరోసారి ఈ సినిమాను జనవరి 17 నుంచి థియేటర్స్‌లోకి తీసుకొచ్చారు మేకర్స్.

ఈ ప్లాన్ వర్కవుట్ అయింది.. పుష్ప 2కు మళ్లీ హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. రీ లోడెడ్ వర్షన్‌కు సిటీస్‌లో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని స్క్రీన్స్‌లోనే ఈ సినిమా ఉన్నా.. ఉన్న స్క్రీన్స్ అన్నీ హౌజ్ ఫుల్ అవుతున్నాయి.

ఇదే దూకుడు మరో 10 రోజులు సాగితే.. సినిమా 2000 కోట్ల మ్యాజికల్ క్లబ్బులోకి అడుగు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ రికార్డు అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా పుష్ప 2 నిలుస్తుంది.





























