Team India: ఛాంపియన్స్ ట్రోపీ నుంచి శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?

ICC Champions Trophy: ఈ ఐసీసీ టోర్నీలో భారత్ ఎలాంటి స్వ్కాడ్‌తో బరిలోకి దిగనుందోనని అందరి దృష్టి నెలకొంది. ఇంతలో, ఒక మాజీ భారత ఓపెనర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తన భారత జట్టును ఎంపిక చేశాడు. ఇందులో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లు చోటు దక్కించుకోలేకపోయాడు. అదే సమయంలో యశస్వి జైస్వాల్‌కు లక్కి చాన్స్ ఇచ్చాడు.

Team India: ఛాంపియన్స్ ట్రోపీ నుంచి శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Jan 10, 2025 | 1:45 PM

Indian Cricket Team: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇంకా చాలా జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇందులో భారత్ కూడా ఉంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతలో, ఒక మాజీ భారత ఓపెనర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఎంపిక చేశాడు. ఇందులో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లు చేర్చలేదు. అదే సమయంలో, యశస్వి జైస్వాల్‌ను అతని జట్టులో చేర్చి షాకిచ్చాడు.

ఇంగ్లండ్‌తో భారత్ వన్డే సిరీస్‌కి రంగం సిద్ధం..

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇందులో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో టీం ఇండియా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ టోర్నీకి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన భారత జట్టును ఎంపిక చేసుకున్నాడు.

మాజీ ఓపెనర్ ఎవరిని డ్రాప్ చేశాడంటే..

కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఆకాశ్ చోప్రా తన జట్టును ప్రారంభించాడు. రెండో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌ని చేర్చారు. అదే సమయంలో యశస్వి జైస్వాల్‌ను కూడా తన జట్టులో ఎంపిక చేసుకున్నాడు. వీరితో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ముగ్గురు ఆల్ రౌండర్లకు చోటు..

ఆకాశ్ చోప్రా తన జట్టులో ముగ్గురు ఆల్ రౌండర్లను చేర్చుకున్నాడు. ఇందులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ రూపంలో నైపుణ్యం కలిగిన స్పిన్నర్‌ని చేర్చారు. భారత దిగ్గజాలు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ రూపంలో నలుగురు పేసర్లను ఉంచారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఆకాష్ చోప్రా సెలక్ట్ చేసిన భారత జట్టు..

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు