IPL 2023: టీమిండియా క్రికెటర్ పృథ్వీషాకు షాక్.. వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
క్రికేటేతర కారణాలతో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నఈ స్టార్ ప్లేయర్‌పై ముంబైలో కేసు నమోదైంది. పృథ్వీ షాపై తీవ్ర వేధింపుల ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ కేసు పెట్టింది.
క్రికేటేతర కారణాలతో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నఈ స్టార్ ప్లేయర్‌పై ముంబైలో కేసు నమోదైంది. పృథ్వీ షాపై తీవ్ర వేధింపుల ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ కేసు పెట్టింది. ఫిబ్రవరిలో సప్నా గిల్, పృథ్వీ షా స్నేహితుల మధ్య గొడవ సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ క్లబ్ వెలువల పృథ్వీ షా స్నేహితులు, సప్నా గిల్ స్నేహితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సంఘటన తరువాత, పృథ్వీ షా, అతని స్నేహితులు తనను వేధించారని, దాడి చేశారని సప్నా గిల్ ఆరోపించింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి అంధేరీ మేజిస్ట్రేట్ 66 కోర్టులో పృథ్వీ షాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీ బ్యాటర్‌పై ఐపీసీ సెక్షన్ 354, 509, 324 కింద కేసు నమోదు చేశారు. పృథ్వీ షా స్నేహితుడు సురేంద్ర యాదవ్‌పై కూడా కేసు నమోదైంది. ఇద్దరూ తనను బ్యాట్‌తో కొట్టారంటూ సప్నా గిల్ సాక్ష్యాధారలను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ ఏప్రిల్ 17న జరగనుంది.
మరోవైపు పృథ్వీ షాతో బలవంతంగా సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారని సప్నా గిల్‌పై ఆరోపణలు వచ్చాయి. అంతేగాక పృథ్వీషా, అతని స్నేహితులపై ఆమె దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు షా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సప్నా గిల్ సహా ఆమె స్నేహితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా గిల్ పృథ్వీషాపై తిరిగి కేసు పెట్టింది. పృథ్వీషా ప్రస్తుతం IPL 2023లో ఆడుతున్నందున ఇది అతనికి ఇబ్బంది కలిగించే విషయం. ఇదిలా ఉంటే పృథ్వీషా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమి మొదటిసారేమీ కాదు. 2021లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని షాపై ఆరోపణలు వచ్చాయి. అలాగే డోపింగ్ కారణంగా పృథ్వీ షాపై నిషేధం కూడా పడింది. 2019లో ఈ ఆటగాడిపై బీసీసీఐ 8 నెలల నిషేధం విధించింది .
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..