Gautam Gambhir: ఇది సీరియస్ గేమ్.. పార్టీలు, బాలీవుడ్‌కే పరిమితం కాదు.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన గంభీర్
Kolkata knight Riders: ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ పరిస్థితి గమనిస్తే.. ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది. ఇక గతేడాది ప్రదర్శన చూస్తే.. అంత గొప్పగా ఏం లేదు. రెగ్యులర్ సారథి శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో నితీశ్ రాణా ఆ బాధ్యతలను స్వీకరించాడు. ఆ సీజన్‌లో ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 6 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఇక పాయింట్ల పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Gautam Gambhir: ఐపీఎల్ 2024 ((IPL)) ప్రారంభానికి ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక కామెంట్స్ చేశాడు. ఐపీఎల్‌లో క్రికెటర్లు తమ అభిమానులకు అంకితభావంతో ఉండాలని ఆయన సూచించారు. గంభీర్ ప్రకారం, IPL కేవలం పార్టీలకు, బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ హోరాహోరీ క్రికెట్ జరుగుతుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత రిచ్ లీగ్‌గా మారిందని తెలిపాడు.
గౌతమ్ గంభీర్ నాయకత్వంలో, KKR 2012, 2014 లో IPL టైటిల్‌ను గెలుచుకుంది. అద్భుతమైన ప్రదర్శన చేసింది. గంభీర్ తన చివరి సీజన్‌ను 2017లో KKR తరపున ఆడాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. అతను ఢిల్లీ తరపున ఒక సీజన్ ఆడిన తర్వాత IPL నుంచి రిటైర్ అయ్యాడు. గత రెండు ఎడిషన్లలో, గంభీర్ లక్నో జట్టులో మెంటార్ పాత్రను పోషిస్తున్నాడు. రెండుసార్లు జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అయితే, ఇప్పుడు మరోసారి గంభీర్ తన పాత జట్టు KKRలోకి వచ్చాడు.
ఐపీఎల్ అంతర్జాతీయ క్రికెట్‌తో సమానం – గౌతమ్ గంభీర్..
కొత్త సీజన్ ప్రారంభానికి ముందు, గౌతమ్ గంభీర్ క్రికెటర్లకు కీలక వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్‌ను సీరియస్ క్రికెట్‌గా పరిగణించాలని చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన సంభాషణలో ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ నాకు సీరియస్ క్రికెట్ అని తొలిరోజే స్పష్టం చేశాను. ఇది కేవలం బాలీవుడ్‌కే కాదు.. పార్టీలు లేదా ఇతర విషయాల కోసం కానేకాదు. ఇక్కడ మీరు మైదానంలోకి వెళ్లి సవాలుతో కూడిన క్రికెట్ ఆడాలి. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, ఇక్కడ పూర్తి క్రికెట్ ఉంది. ప్రపంచంలోని ఇతర లీగ్‌లతో పోలిస్తే, ఐపీఎల్ అంతర్జాతీయ క్రికెట్‌తో సమానంగా ఉంటుంది. మీరు ఇక్కడ విజయవంతమైన జట్టుగా మారాలనుకుంటే, మీరు మైదానంలో అద్భుత ప్రదర్శన ఇవ్వాలని సూచించాడు.




గతేడాది కోల్‌కతా పరిస్థితి..
ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ పరిస్థితి గమనిస్తే.. ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది. ఇక గతేడాది ప్రదర్శన చూస్తే.. అంత గొప్పగా ఏం లేదు. రెగ్యులర్ సారథి శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో నితీశ్ రాణా ఆ బాధ్యతలను స్వీకరించాడు. ఆ సీజన్‌లో ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 6 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఇక పాయింట్ల పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయిత, ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉండడంతో.. సారథిగా బరిలోకి దిగనున్నాడు. మరి ఈ ఏడాది ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
