Video: భారత్‌పై అరంగేట్రం.. 13 సార్లు తలకు తగిలిన బంతి.. కట్‌చేస్తే.. ఆడకుండానే పెవిలియన్‌కు.. ఆ బ్యాడ్‌లక్ ప్లేయర్ ఎవరంటే?
2017లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతను కంకషన్‌కు గురయ్యాడు. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో రెండుసార్లు బంతి అతని హెల్మెట్‌కు తగిలింది. 2018లో న్యూ సౌత్ వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌన్సర్‌తో గాయపడ్డాడు. 2020లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకసారి, ఇతర జట్టుతో ఒకసారి గాయపడ్డాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే 2024లో సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పుకోవ్స్కీకి హెల్మెట్‌పై బంతి తగిలింది. టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి అతనికి ఇలానే జరిగింది.

Will Pucovski Suffers Concussion: భారత్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విల్ పుకోవ్‌స్కీకి అదృష్టం అస్సలు కలిసిరాలేదు. అతను గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే.. మరలా గాయపడుతున్నాడు. చాలా సందర్భాలలో అతను ఇదే రకంగా గాయపడి మైదానం నుంచి బయటికి వస్తున్నాడు. పుకోవ్స్కీ విషయంలో మరోసారి ఇలాంటిదే జరిగింది. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడుతున్న పుకోవ్‌స్కీ మళ్లీ బంతి తలకు తగిలింది. బంతి తలకు తగలగానే మోకాళ్లపై కూర్చున్నాడు. ఆ తర్వాత మైదానంలో కుప్పకూలాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ గాయం కారణంగా, పుకోవ్స్కీ కంకషన్ (తేలికపాటి అపస్మారక స్థితి)కు గురయ్యాడు. అతను గాయపడి రిటైర్ అయ్యి మైదానం నుంచి తిరిగి రావడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నాడు.
విల్ పుకోవ్స్కీ షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా తరపున ఆడుతున్నాడు. ఆదివారం టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ రిలే మెరెడిత్ నుంచి ఫాస్ట్ బౌన్సర్ అతని హెల్మెట్‌కు తగిలింది. ఆ తరువాత, పుకోవ్స్కీ నేరుగా మైదానంలో పడిపోయాడు. ఆ తర్వాత విక్టోరియా జట్టు ఫిజియో అతని పరిస్థితి గురించి ఆరా తీసేందుకు వెంటనే మైదానానికి వచ్చారు. కొంత సమయం తరువాత, విల్ బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. విక్టోరియా కంకషన్ ప్లేయర్‌గా పుకోవ్స్కీ స్థానంలో క్యాంప్‌బెల్ కాల్వేని తన ప్లేయింగ్ 11లోకి చేర్చుకుంది.

పుకోవ్స్కీ 2024లో రెండోసారి..
My head hurts reading about Will Pucovski getting retired hurt after taking a blow on the head. This could be seriously detrimental to Pucovski later in his life. https://t.co/yYbh5076pH
— Prakhar Sachdeo (@simplyparu) March 3, 2024
“పుకోవ్స్కీ ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నాడు. సరైన సమయంలో అతని పరిస్థితి గురించి సమాచారం అందించడానికి మేం ప్రయత్నిస్తాము” అని క్రికెట్ విక్టోరియా ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో కూడా పుకోవ్‌స్కీ తలకు బంతి తగిలింది. దీంతో కోలుకున్న అతను గత నెలలో సిడ్నీలో న్యూ సౌత్ వేల్స్ తో జరిగిన మ్యాచ్ లో 131 పరుగులు చేశాడు. పుకోవ్‌స్కీ గతంలో తలపై 13 సార్లు బంతి తగలడం వల్ల కంకషన్‌కు గురయ్యాడు.
ఇప్పటివరకు 13 సార్లు తలకు గాయాలు..
2017లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతను కంకషన్‌కు గురయ్యాడు. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో రెండుసార్లు బంతి అతని హెల్మెట్‌కు తగిలింది. 2018లో న్యూ సౌత్ వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌన్సర్‌తో గాయపడ్డాడు. 2020లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకసారి, ఇతర జట్టుతో ఒకసారి గాయపడ్డాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే 2024లో సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పుకోవ్స్కీకి హెల్మెట్‌పై బంతి తగిలింది. టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి అతనికి ఇలానే జరిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..