IPL 2024: రాజస్థాన్ రాయల్స్ కోసం జెర్సీ డిజైన్ చేసిన చాహల్.. వీడియో చూస్తే పొట్టచెక్కలే..
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 24న జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో ఆడనుంది. ఆ జట్టు కెప్టెన్‌గా సంజూ శాంసన్ ఉన్నాడు. ఈసారి వేలంలో ఈ ఫ్రాంచైజీ కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఈ క్రమంలో రోవ్‌మన్ పావెల్ (7.4 కోట్లు), శుభమ్ దూబే (5.80 కోట్లు), టామ్ కోహ్లర్-కాడ్‌మోర్ (40 లక్షలు), అబిద్ ముస్తాక్ (20 లక్షలు), నాంద్రే బెర్గర్ (50 లక్షలు) జట్టులోకి వచ్చారు. జో రూట్, అబ్దుల్ బాసిత్, జాసన్ హోల్డర్, ఆకాష్ వశిష్ట్, కుల్దీప్ యాదవ్, ఒబేద్ మెక్‌కాయ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం ఆసిఫ్‌లను విడుదల చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్ మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో IPL 2024కి ముందు రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీని విడుదల చేసింది. స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సహాయంతో ఫ్రాంచైజీ జెర్సీని ఆవిష్కరించింది. ఈసారి IPL 2008 విజేత జట్టు తన జెర్సీలో రాజస్థాన్ బంధాన్ని డిజైన్ థీమ్‌కు ప్రాధాన్యతనిచ్చింది. దీనితో పాటు, రాష్ట్రంలోని చారిత్రక రాజభవనాలు, కోటలు కూడా ప్రతీకాత్మకంగా చేర్చారు. రాయల్స్ జెర్సీ రంగులు పింక్, ముదురు నీలం రంగులో మాత్రమే ఉంచారు.
ఈ మధ్యలో రాజస్థాన్ రాయల్స్ సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన జట్టు కోసం కొత్త జెర్సీ రూపకల్పన చేసినట్లు అభిమానులతో పంచుకున్నాడు. దీని ఫన్నీ వీడియోను ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, 33 ఏళ్ల చాహల్ మొదట జట్టు కొత్త జెర్సీని పెయింటింగ్ ద్వారా డిజైన్ చేశాడు. అతను ఒక వింత జెర్సీని ధరించి తన అభిప్రాయాన్ని తెలియజేయమని జోస్ బట్లర్‌ని అడుగుతాడు. బట్లర్‌కి అతని డిజైన్ అస్సలు నచ్చకపోవడం గమనార్హం.
ఆ తర్వాత చాహల్ ఇతర జట్టు సభ్యులను సంప్రదించి వారి అభిప్రాయాన్ని కూడా కోరతాడు. కానీ వారు కూడా జెర్సీలో ప్రత్యేకంగా ఏమీ లేదంటూ కొట్టిపారేస్తారు. ఆ తర్వాత, భారత లెగ్ స్పిన్నర్ తన కెప్టెన్ సంజూ శాంసన్‌కు జెర్సీ చిత్రాన్ని పంపిస్తాడు. అతని అభిప్రాయం చెప్పమని అడుగుతాడు. దానికి శాంసన్ కూడా జెర్సీ బాగోలేదంటూ చెప్పేస్తాడు. అయితే, ఇదంతా కేవలం ఫన్నీ కోసమే చేసినట్లు తర్వాత ప్రకటించారు. ఆ తర్వాత అతని చేతుల మీదుగా ఫ్రాంఛైజీ రాబోయే సీజన్ కోసం తన కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
జెర్సీ ముందు, వెనుక రెండింటిలోనూ షీల్డ్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. ఇది రాజస్థాన్‌లోని గత, ప్రస్తుత గొప్ప యోధులందరికీ నివాళులు అర్పిస్తుంది. జెర్సీ రాజస్థానీ మహిళల సంప్రదాయ వస్త్రధారణ నుంచి ప్రేరణ పొందిన విలక్షణమైన బంధాన్ని చూపిస్తుంది.
జెర్సీని లాంచ్ చేసిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేక్ లష్ మాక్రామ్ దీనిపై మాట్లాడుతూ.. రాజస్థాన్‌తో ముడిపడి ఉన్న సంస్కృతి, వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మేం చాలా గర్వపడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఆటగాళ్లు, అభిమానులు గర్వంగా ధరించే చిక్ డిజైన్‌లో ముఖ్యమైన సాంస్కృతిక, చారిత్రక అంశాలను కలపడానికి ప్రతి కొత్త సీజన్ మాకు అవకాశాన్ని ఇస్తుంది. మేం ఈ సీజన్ కోసం థ్రెడ్‌లను పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాం. ఈ సీజన్‌లో మేం ఎక్కడ ఆడినా గులాబీ రంగు సముద్రాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాం అంటూ చెప్పుకొచ్ఆడు.
IPL 2024 రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్?
Wake up, our #IPL2024 jersey is out! 💗😂 pic.twitter.com/JPcNudCwEG
— Rajasthan Royals (@rajasthanroyals) March 4, 2024
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 24న జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో ఆడనుంది. ఆ జట్టు కెప్టెన్‌గా సంజూ శాంసన్ ఉన్నాడు. ఈసారి వేలంలో ఈ ఫ్రాంచైజీ కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఈ క్రమంలో రోవ్‌మన్ పావెల్ (7.4 కోట్లు), శుభమ్ దూబే (5.80 కోట్లు), టామ్ కోహ్లర్-కాడ్‌మోర్ (40 లక్షలు), అబిద్ ముస్తాక్ (20 లక్షలు), నాంద్రే బెర్గర్ (50 లక్షలు) జట్టులోకి వచ్చారు. జో రూట్, అబ్దుల్ బాసిత్, జాసన్ హోల్డర్, ఆకాష్ వశిష్ట్, కుల్దీప్ యాదవ్, ఒబేద్ మెక్‌కాయ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం ఆసిఫ్‌లను విడుదల చేసింది.
రాజస్థాన్ రాయల్స్ IPL 2024 జట్టు..
సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ర్యాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కృనాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్, అవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, నాండ్రే బెర్గర్, అబిద్ ముస్తాక్, టామ్ కోహ్లర్-కెడ్మోర్.
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2024 షెడ్యూల్..
1. మార్చి 24న, రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, జైపూర్
2. మార్చి 28న, రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, జైపూర్
3. ఏప్రిల్ 1న, రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్, ముంబై
4. ఏప్రిల్ 6న, రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, జైపూర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..