AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ముగ్గురు.. లిస్టులో టీమిండియా డబుల్ సెంచరీల ప్లేయర్..

Player of the Month: యశస్వి జైస్వాల్ గత నెలలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో రెండింట్లో వరుసగా డబుల్ సెంచరీలు సాధించాడు. వరుసగా టెస్టు మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లోని రెండో టెస్టులో జైస్వాల్ మొదట ఇన్నింగ్స్‌లో 209 పరుగులతో ఆడి, తర్వాతి మ్యాచ్‌లో అజేయంగా 214 పరుగులు చేశాడు. దీంతో పాటు నాలుగో టెస్టులోనూ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విధంగా, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ మూడు మ్యాచ్‌ల్లో 112 సగటుతో మొత్తం 560 పరుగులు చేశాడు.

Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ముగ్గురు.. లిస్టులో టీమిండియా డబుల్ సెంచరీల ప్లేయర్..
Yashasvi Jaiswal Ind Vs Eng
Venkata Chari
|

Updated on: Mar 04, 2024 | 8:54 PM

Share

ICC Player of The Month: ఫిబ్రవరి నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకునే పోటీదారుల పేర్లను ICC వెల్లడించింది. పురుషుల విభాగంలో భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంకలకు చోటు దక్కింది. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు గత నెలలో చాలా పరుగులు చేసి తమ తమ జట్ల విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్‌తో పాటు అమెరికాకు చెందిన కవిషా అగోదాగే, ఈషా ఓజా పోటీదారులుగా ఎంపికయ్యారు.

యశస్వి జైస్వాల్ గత నెలలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో రెండింట్లో వరుసగా డబుల్ సెంచరీలు సాధించాడు. వరుసగా టెస్టు మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లోని రెండో టెస్టులో జైస్వాల్ మొదట ఇన్నింగ్స్‌లో 209 పరుగులతో ఆడి, తర్వాతి మ్యాచ్‌లో అజేయంగా 214 పరుగులు చేశాడు. దీంతో పాటు నాలుగో టెస్టులోనూ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విధంగా, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ మూడు మ్యాచ్‌ల్లో 112 సగటుతో మొత్తం 560 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా, జైస్వాల్ మొదటిసారిగా ప్లేయర్ ఆఫ్ ది అవార్డుకు పోటీదారుగా ఎంపికయ్యాడు.

గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు సాధించాడు. అతని జట్టు 2-0 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రాణించలేకపోయాడు. విలియమ్సన్ మూడు మ్యాచ్‌ల్లో 412 పరుగులు చేశాడు. గతేడాది మార్చి తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ని గెలుచుకునే రేసులో మరోసారి ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సాంక ఫిబ్రవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేలు, టీ20ఐ సిరీస్‌లో పాల్గొన్నాడు. నిస్సాంక వన్డే మ్యాచ్‌లలో చాలా పరుగులు సాధించాడు. మొదటి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేశాడు. శ్రీలంక నుంచి ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. ఆ తర్వాత మూడో వన్డేలో 118 పరుగులతో సెంచరీ సాధించాడు. కాగా, T20I సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో, అతను 60 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ గత నెలలో ఆరు మ్యాచ్‌ల్లో మొత్తం 437 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..