WPL 2024: బెంగళూరులో చివరి WPL మ్యాచ్.. హ్యాట్రిక్ ఓటమి ఎదురయ్యేనా?
UP Warriorz vs Royal Challengers Bangalore: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోని 11వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు నేడు యూపీ వారియర్స్ మహిళలతో తలపడుతున్నారు. బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తుంది.

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League)11వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు నేడు యూపీ వారియర్స్ మహిళల జట్టు (UP Warriorz vs Royal Challengers Bangalore) తో తలపడుతోంది. బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఈరోజు ఇరు జట్లకు హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉంది. ఈరోజు యూపీ వారియర్స్ గెలిస్తే హ్యాట్రిక్ విజయాలు అందుకుంటుంది. అదే సమయంలో ఈరోజు జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోతే.. ఆ జట్టు హ్యాట్రిక్ ఓటమిని చవిచూడనుంది. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీకి సొంత మైదానంలో ఇదే చివరి మ్యాచ్ కావడంతో స్మృతి జట్టు గెలవాల్సిన ఒత్తిడిలో పడింది.
ఆర్సీబీకి విజయం కావాలి..
పాయింట్ల పట్టికలో బెంగళూరు, యూపీ వారియర్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. నిజానికి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అయితే యూపీ వారియర్స్ జట్టు కూడా అదే సంఖ్యలో విజయాలతో మూడో స్థానంలో ఉంది. అయితే రన్ రేట్ లో స్మృతి మంధాన జట్టు మైనస్ కాగా, అలిస్సా హీలీ జట్టు ప్లస్ అయింది.




రెండు జట్లు..
View this post on Instagram
బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ మోలినెక్స్, జార్జియా వేర్‌హామ్, ఏక్తా బిష్త్ (శ్రేయాంక పాటిల్ స్థానంలో), సిమ్రాన్ బహదూర్, ఆశా శోబన, రేణుకా సింగ్.
యూపీ వారియర్స్: అలిస్సా హీలీ (కెప్టెన్), కిరణ్ నవగిరే, చమరి అతపతు, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, సైమా థక్వాడ్, అంజలి సర్వాణి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
