AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదెక్కడి చెత్త ఫీల్డింగ్ రా అయ్యా! కష్టపడి బౌండరీ కాపాడితే చివరకు 6 పరుగులు సమర్పించుకున్నారుగా

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో ఒక ఆసక్తికర సంఘటనలో, అద్భుతమైన ఫీల్డింగ్ తర్వాత ఒక తప్పుడు విసిర్పుతో 6 పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఫీల్డర్ బౌండరీని కాపాడినప్పటికీ, బౌలర్ పొరపాటున బంతిని నేరుగా బౌండరీకి విసిరాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, క్రికెట్ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది. మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ టూర్ ముంబై, బెంగళూరు నగరాల్లో ఘనంగా జరిగింది, అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

Video: ఇదెక్కడి చెత్త ఫీల్డింగ్ రా అయ్యా! కష్టపడి బౌండరీ కాపాడితే చివరకు 6 పరుగులు సమర్పించుకున్నారుగా
Ispl
Narsimha
|

Updated on: Feb 04, 2025 | 11:27 AM

Share

క్రికెట్‌లో కొన్నిసార్లు ఆశ్చర్యపరిచే, హాస్యాస్పద సంఘటనలు చోటుచేసుకుంటాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన ఘటన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో జరిగింది.

ఒక బ్యాటర్ మిడ్-వికెట్ దిశగా బలమైన షాట్ కొట్టాడు. అది బౌండరీ అవ్వడం ఖాయం అనుకున్న తరుణంలో, ఫీల్డర్ గాల్లోకి దూకి బంతిని బౌండరీ లైన్ లోపలికి నెట్టేశాడు. అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఫోర్‌ను తప్పించాడు. కానీ, కథ ఇక్కడితో ముగియలేదు.

బంతిని బౌలర్ వైపుకు విసిరిన ఫీల్డర్, రనౌట్ అవకాశం కోసం వేచి చూసాడు. అయితే, బౌలర్ పొరపాటున బంతిని చాలా బలంగా విసిరి నేరుగా బౌండరీకి పంపాడు. అప్పటికి బ్యాటర్లు రెండు పరుగులు పరుగులు చేశారు. దీంతో, బౌలర్ నాలుగు బైలు + రెండు పరుగులు, కలిపి ఆరు పరుగులు ఇచ్చాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది!

ఇక ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ టూర్ క్రికెట్ అభిమానుల్లో మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. DP వరల్డ్ భాగస్వామ్యంతో సాగుతున్న ఈ టూర్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. భారతదేశంలో ముంబై, బెంగళూరు నగరాలను సందర్శించిన ఈ ట్రోఫీ టూర్ అక్కడ అభిమానుల మధ్య భారీ స్పందన పొందింది.

ముంబై స్టాప్‌లో ట్రోఫీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవ వేడుకల్లో ట్రోఫీ ప్రదర్శించబడింది, ఈ కార్యక్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా మాజీ కెప్టెన్లు దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, అజింక్య రహానే పాల్గొన్నారు. అలాగే, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, డయానా ఎడుల్జీ లాంటి ICC హాల్ ఆఫ్ ఫేమర్లు ట్రోఫీతో కలిసి ప్రత్యేకంగా హాజరయ్యారు. ముంబై నగరంలోని గేట్‌వే ఆఫ్ ఇండియా, ఛత్రపతి శివాజీ టెర్మినస్, బ్యాండ్‌స్టాండ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో ట్రోఫీ ప్రదర్శన జరిగింది, ఇది అభిమానులకు గొప్ప అనుభూతిని కలిగించింది.

అదే విధంగా, బెంగళూరులో నెక్సస్ శాంతినికేతన్ మాల్ లో “ట్రోఫీ కార్నివాల్” నిర్వహించగా, బెంగళూరు ప్యాలెస్, ఫ్రీడమ్ పార్క్, ఎం చిన్నస్వామి స్టేడియం, చర్చి స్ట్రీట్ వంటి ప్రముఖ ప్రదేశాల్లో ట్రోఫీ ప్రదర్శించబడింది. బెంగళూరులోని అభిమానులు ట్రోఫీని దగ్గరగా చూసే అవకాశాన్ని ఆస్వాదించారు, టోర్నమెంట్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాలను కవర్ చేసిన ఈ ట్రోఫీ టూర్ చివరగా పాకిస్తాన్ కు చేరుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9, 2025 వరకు పాకిస్తాన్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మెగా టోర్నమెంట్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..