Mohammed Siraj: బిగ్ బాస్ బ్యూటీకి మహమ్మద్ సిరాజ్ బౌల్డ్
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన రిలేషన్ షిప్ కారణంగా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో డేటింగ్ లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఆమె పుట్టినరోజు వేడుకల్లో వారిద్దరూ నవ్వుతున్న కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో చాలా మంది మహ్మద్ సిరాజ్-జనై లు ప్రేమలో ఉన్నారని భావించారు.
అయితే ఈ రూమర్లు ఎక్కువ కావడంతో జనై, సిరాజ్ తమ రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చారు. మొదట సిరాజ్ జనైను సోదరి అని పిలవడం ద్వారా డేటింగ్ వదంతులకు ముగింపు పలికాడు. ఆ తర్వాత జనై కూడా సిరాజ్ పోస్టుకు లైక్ కొట్టింది. అయితే ఇప్పుడు సిరాజ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఇప్పుడు అతను ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ నటితో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ భారత స్టార్ బౌలర్ బిగ్ బాస్ ఫేమ్ మహీరా శర్మతో డేటింగ్ చేస్తున్నాడు. చాలా కాలంగా సిరాజ్, మహిరా శర్మ లు ప్రేమలో మునిగి తేలుతున్నారట. కాగా గతేడాది నవంబర్‌లో మొదటిసారి వీరిద్దరి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. గత ఏడాది నవంబర్‌లో బిగ్ బాస్ ఫేమ్ ఫోటోను సిరాజ్ లైక్ కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి అయితే ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తల కారణంగా ఈ డేటింగ్ వ్యవహారం మరోసారి ఊపందుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
