AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: అకస్మాత్తుగా మైదానం వీడిన బెన్ స్టోక్స్ సేన.. లైవ్ మ్యాచ్‌లో కలకలం.. అసలేం జరిగింది?

IND vs ENG: భారత ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు, ఆట మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన సహచర ఆటగాళ్లతో కలిసి మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన, సాధారణంగా మ్యాచ్ మధ్యలో జరిగే ఆటగాళ్ళ మార్పిడి లేదా చికిత్స కోసం బయటకు వెళ్ళలేదు. ఇంగ్లాండ్ జట్టులోని కీలక ఆటగాళ్లందరూ ఒకేసారి మైదానం వీడటం చర్చనీయాంశంగా మారింది.

IND vs ENG: అకస్మాత్తుగా మైదానం వీడిన బెన్ స్టోక్స్ సేన.. లైవ్ మ్యాచ్‌లో కలకలం.. అసలేం జరిగింది?
Ind Vs Eng 2nd Test
Venkata Chari
|

Updated on: Jul 04, 2025 | 10:35 AM

Share

క్రికెట్ మ్యాచ్‌లలో, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో, కొన్నిసార్లు అనూహ్య సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జులై 2025లో ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఇలాంటి ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతున్న మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తో పాటు ఇతర ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మైదానం వీడి వెళ్ళిపోయారు. ఈ సంఘటన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీని వెనుక ఉన్న కారణాలపై అనేక చర్చలు నడుస్తున్నాయి.

అసలేం ఏం జరిగింది?

భారత ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు, ఆట మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన సహచర ఆటగాళ్లతో కలిసి మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన, సాధారణంగా మ్యాచ్ మధ్యలో జరిగే ఆటగాళ్ళ మార్పిడి లేదా చికిత్స కోసం బయటకు వెళ్ళలేదు. ఇంగ్లాండ్ జట్టులోని కీలక ఆటగాళ్లందరూ ఒకేసారి మైదానం వీడటం చర్చనీయాంశంగా మారింది. అయితే, వెంటనే ఏమి జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, ఈ చర్య వెనుక పిచ్ పరిస్థితులు, మ్యాచ్‌లోని ఒత్తిడి ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఆట ప్రారంభమైన మొదటి గంట తర్వాత, అంపైర్లు ప్రతి గంట ఆట తర్వాత 5 నిమిషాల డ్రింక్స్ బ్రేక్ ప్రకటిస్తారు. అయితే, ఇంగ్లండ్ ఆటగాళ్లు డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఇలా చేయడం గమనార్హం.

పిచ్ ట్యాంపరింగ్ ఆరోపణలు..

ఈ సంఘటనకు కొద్దిసేపటి ముందు, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పిచ్‌లోని “డేంజర్ ఏరియా”లో పదేపదే పరిగెత్తడంపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు, ముఖ్యంగా క్రిస్ వోక్స్ మరియు, బెన్ స్టోక్స్ అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. జడేజా ఉద్దేశపూర్వకంగా పిచ్‌ను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపించారు, తద్వారా పిచ్‌ను మరింత రఫ్‌గా చేసి తమ స్పిన్నర్లకు ప్రయోజనం చేకూర్చాలని భారత్ చూస్తుందని వారి భావన. అంపైర్ జడేజాను హెచ్చరించినప్పటికీ, ఇంగ్లాండ్ జట్టు ఆందోళన చెందుతూనే ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇంగ్లాండ్ ఆటగాళ్లు మైదానం వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రెండో రోజు పరిస్థితి ఇదే..

రెండవ రోజు ఆట విషయానికొస్తే, టీం ఇండియా ఇంగ్లాండ్‌ను రోజంతా వెనుకంజలోనే ఉంచింది. కెప్టెన్ గిల్ 269 పరుగులతో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఇది గిల్ మొదటి టెస్ట్ డబుల్ సెంచరీగా నిలిచింది. అనంతరం, ఇంగ్లాండ్ కేవలం 25 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆకాష్ దీప్ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు పడగొట్టగా, మహ్మద్ సిరాజ్ కూడా 1 వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత, జో రూట్, హ్యారీ బ్రూక్ నాటౌట్‌గా నిలిచి జట్టును 77 పరుగులకు తీసుకెళ్లారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..