WTC Final: కేఎల్ రాహుల్ స్థానంలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ ప్లేయర్.. ఉమేష్-ఉనద్కత్‌లపై ఇంకా సందిగ్ధమే..
WTC Final India Squad 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. WTC ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లో జరుగుతుంది.

WTC Final India Squad 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. WTC ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లో జరుగుతుంది.
మే 1న లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ కొట్టిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో రాహుల్ కాలికి గాయమైంది. తర్వాత మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఆఖర్లో గాయపడినా రాహుల్ బ్యాటింగ్ కు దిగాడు.
రాహుల్ కాలికి సర్జరీ చేయాల్సి ఉంది. ఆ తరువాత, అతను దాదాపు ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 7 నుంచి 11 వరకు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆడడం సాధ్యం కాదు. ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ గాయాల గురించి కూడా BCCI కీలక ప్రకటన చేసింది. అయితే వారి భర్తీని మాత్రం ప్రకటించలేదు. ఇటువంటి పరిస్థితిలో, ఈ ఇద్దరు బౌలర్లు ఆడాలనే ఆశ ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది.




కాగా, ఐపీఎల్ 16వ సీజన్‌లో గాయం కారణంగా 16 మంది ఆటగాళ్లు దూరమయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అత్యధిక సంఖ్యలో ఆటగాళ్లు ఉన్నారు.
భర్తీ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ కిషన్. స్టాండ్ బై: రితురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




