AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC2022: ఆసీస్‌లో ఛాంపియన్ అవ్వాలంటే.. ఇలా చేస్తే చాలు.. రిజల్ట్ వేరేలా ఉంటది.. సచిన్ ఇంట్రెస్టింట్ టిప్స్..

Sachin Tendulkar: ఆస్ట్రేలియా మైదానాలు ఇతర దేశాల మైదానాల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫోర్లు, సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు.

T20 WC2022: ఆసీస్‌లో ఛాంపియన్ అవ్వాలంటే.. ఇలా చేస్తే చాలు.. రిజల్ట్ వేరేలా ఉంటది.. సచిన్ ఇంట్రెస్టింట్ టిప్స్..
Sachin Tendulkar
Follow us
Venkata Chari

|

Updated on: Oct 20, 2022 | 12:40 PM

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌లో నిమగ్నమవ్వగా, కొన్ని జట్టు క్వాలిఫయర్ మ్యా్చ్‌లు ఆడుతున్నాయి. ఈ క్రమంలో అసలు సమరం అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.అయితే, ఇక్కడి మైదానాలు చాలా పెద్దవి కాబట్టి ఫోర్లు, సిక్సర్లు కొట్టడం ప్రపంచంలోని ఇతర మైదానాల్లో ఉన్నంత సులువు కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సచిన్ టెండూల్కర్, ఇక్కడి గ్రౌండ్స్‌లో ఎలా ఆడాలో బ్యాటర్లకు పలు సూచనలు ఇచ్చాడు. విశాలమైన మైదానం ఉండటం వల్ల ఇక్కడ వికెట్ల మధ్య పరుగులు చాలా ముఖ్యమన సచిన్ అభిప్రాయపడ్డాడు.

బౌండరీలకంటే సింగిల్స్ ముఖ్యం..

సచిన్ ఇంగ్లీష్ వార్తాపత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక కాలమ్ రాశారు. ఆస్ట్రేలియాలో వికెట్ల మధ్య రేసును ఎలా సులభతరం చేయాలనే దానిపై తన అభిప్రాయాన్ని తెలిపారు. సచిన్ చెప్పిన ఈ మాటను అంగీకరించిన బ్యాట్స్‌మెన్ విజయావకాశాలను పెంచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. సచిన్ కంటే ముందే చాలా మంది అనుభవజ్ఞులు ఆస్ట్రేలియాలో రన్నింగ్ చాలా ముఖ్యమైనదని చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ ఫోర్లు, సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదని వార్మప్, క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో కూడా కనిపించిందని మాస్టర్ బ్లాస్టర్ నొక్కి చెప్పారు. “ఆస్ట్రేలియాలో డ్రాప్-ఇన్ పిచ్‌లు ఉంటాయి. అన్నివైపులా గడ్డి మందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండు ఉపరితలాలు ఉంటాయంటూ సూచించారు. బౌండరీలు బాదుతూనే, సింగిల్స్‌కు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యమని తెలిపారు.

వాటిపై దృష్టి పెట్టండి..

ఆస్ట్రేలియన్ మైదానంలో బూట్ల స్పైక్‌లు కూడా ముఖ్యమైనవిగా సచిన్ పేర్కొన్నాడు. “ఆస్ట్రేలియన్ పిచ్‌లపై నేను పొడవైన స్పైక్‌లను సిఫారసు చేస్తాను. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు స్పైక్‌లను పదును పెట్టుకోవాలి. ఇది రన్నింగ్ సులభతరం చేస్తుంది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మృదువైన స్పైక్‌లు నడుస్తాయి. కానీ, బ్యాటింగ్ చేసేటప్పుడు స్ప్రింటర్ స్పైక్‌లను ధరించండి. ఈ చిన్న విషయాలు పెద్ద మార్పును కలిగిస్తాయి” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఎక్కడ పరుగెత్తాలి..

బ్యాట్స్‌మెన్ ఎక్కడ పరుగెత్తాలో కూడా సచిన్ వివరించారు. “ఎక్కడ పరుగెత్తాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. డ్రాప్-ఇన్ పిచ్‌ల మూలల్లో పరుగెత్తడం సరైనది. ఎడమచేతి వాటం బౌలర్ బౌలింగ్ చేస్తుంటే, అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ లైన్ వెలుపల నిలబడగలడు. స్ట్రైకర్ లైన్ లోపల పరుగెత్తగలడు. బ్యాట్స్‌మెన్ ఇద్దరూ చిన్న రూట్‌లు తీసుకొని దాని గురించి ముందుగానే మాట్లాడుకోవాలని మాస్టర్ సూచించారు.