AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 47 బంతుల్లో 42 ఫోర్లు, 5 సిక్సర్లు.. ట్రిపుల్ సెంచరీతో టీమిండియా ‘సుల్తాన్ ఆఫ్ ముల్తాన్’ ప్రపంచ రికార్డ్..

47 బంతుల్లో 198 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించి, భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన వీరేంద్ర సెహ్వాగ్.. ఈ ఫార్మాట్‌లో ఓపెనింగ్ నిర్వచనాన్నే మార్చేశాడు.

Cricket: 47 బంతుల్లో 42 ఫోర్లు, 5 సిక్సర్లు.. ట్రిపుల్ సెంచరీతో టీమిండియా 'సుల్తాన్ ఆఫ్ ముల్తాన్' ప్రపంచ రికార్డ్..
sachin tendulkar and virender sehwag
Venkata Chari
|

Updated on: Oct 20, 2022 | 1:16 PM

Share

క్రికెట్ ప్రతి తరంలో కొంతమంది ఆటగాళ్ళు సంచలనాలకు కేంద్ర బిందువులుగా నిలుస్తుంటారు. బ్యాటింగ్, ఫీల్డింగ్ లేదా బౌలింగ్ లాంటి విభాగాల్లో ఆడే విధానంతో విప్లవాత్మ మార్పులతో చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటుంటారు. ఇలాంటి లిస్టులో టీమిండియా క్రికెటర్లు కూడా కొంతమంది ఉన్నారు. కాగా, సచిన్ టెండూల్కర్ కాలంలో అయనను మించిన ఆటగాడు లేడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, వీరేంద్ర సెహ్వాగ్ తనదైన ముద్ర వేసి టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ మార్గాన్ని మార్చేశాడు. ఈరోజు అంటే అక్టోబర్ 20న వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఉంటూ బౌలర్లను బ్యాట్‌తో ఉతికి ఆరేసిన భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్.. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో కొత్త శక్తిని నింపాడు.

సెహ్వాగ్ మూడు ఫార్మాట్లలో తన శక్తిని విస్తరించాడు మరియు అనేక అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటం ద్వారా భారతదేశం కోసం మ్యాచ్‌లను గెలిపించాడు, అయితే టెస్ట్ క్రికెట్ ప్రారంభానికి ఉత్సాహాన్ని తీసుకురావడం అతని అతిపెద్ద సహకారంగా పరిగణించబడుతుంది. కొత్త బంతిని క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు మరియు బంతిని పాతదిగా మార్చడానికి రెండు మార్గాలు ఉన్నాయి, దానిని వదలడం లేదా కొట్టడం. సెహ్వాగ్ మరో పద్ధతిని ప్రయత్నించి దానిని ఫిలాసఫీగా మార్చాడు.

సెహ్వాగ్ రికార్డుల గురించి మాట్లాడినప్పుడల్లా మొదటగా ‘సుల్తాన్ ఆఫ్ ముల్తాన్’ అని పిలుస్తుంటారు. 2004లో పాకిస్థాన్ పర్యటనలో సెహ్వాగ్ ముల్తాన్‌లో 309 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. భారతదేశం తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

సెహ్వాగ్ ముల్తాన్ ట్రిపుల్ సెంచరీని కేవలం 364 బంతుల్లో చేశాడు. కానీ, 4 సంవత్సరాల తర్వాత అతను వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్ కేవలం 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అతను 319 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇందులో 47 బంతుల్లో 42 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 198 పరుగులు వచ్చాయి.

ఈ ఇన్నింగ్స్‌తో టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే మూడో బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ నిలిచాడు. అతని కంటే ముందు డాన్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారా మాత్రమే ఈ ఫీట్ చేయగలిగారు. ఆ తర్వాత క్రిస్ గేల్ కూడా ఈ ప్రత్యేక జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.

టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ సెహ్వాగ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. డిసెంబర్ 2019లో ఇండోర్‌లో వెస్టిండీస్‌పై సెహ్వాగ్ 219 పరుగులు చేశాడు.

2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్‌ గెలవడంలో సెహ్వాగ్‌ కీలకపాత్ర పోషించాడు. సెహ్వాగ్ తన సుదీర్ఘ కెరీర్‌లో 104 టెస్టుల్లో 8586 పరుగులు (23 సెంచరీలు, 32 అర్ధశతకాలు), 251 వన్డేల్లో 8273 పరుగులు (15 సెంచరీలు, 38 అర్ధశతకాలు), 19 టీ20ల్లో 394 పరుగులు (2 ఫిఫ్టీ) చేశాడు. దీనితో పాటు సెహ్వాగ్ పార్ట్ టైమ్ ఆఫ్-బ్రేక్ బౌలర్‌గా టెస్ట్‌లలో 40 వికెట్లు, ODIలలో 96 వికెట్లు పడగొట్టడం ద్వారా కీలక సహకారాన్ని అందించాడు.